బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు: విచారణ ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం!!

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు.సోమవారం డీజీపీతో భేటీ అయిన ముఖ్యమంత్రి, కేసు పురోగతిని సమీక్షించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటివరకు నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు…..

ముఖ్యమంత్రి ప్రశ్నలకు డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నందున, పోలీసు యంత్రాంగం మొత్తం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని వివరించారు. ఈ కారణంగానే కేసు దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని ఆయన ముఖ్యమంత్రికి విన్నవించారు.డీజీపీ వివరణపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేసును వేగవంతం చేయాలని ఆదేశించారు.ఈ కేసు లోతుపాతులను పరిశీలించేందుకు వెంటనే ప్రత్యేక విచారణ బృందాలను (Special Teams) ఏర్పాటు చేయాలని సూచించారు.అంతే కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, పారదర్శకంగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు…..

ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందించారు. ఈ వివాదానికి, భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు,బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు పూర్తిగా వారి వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన విషయం. ఇది పార్టీ కార్యాలయంలోనో లేదా పార్టీ కార్యక్రమాల్లోనో జరిగిన ఘటన కాదని అన్నారు,చట్టం అందరికీ సమానమే. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం పార్టీకి లేదని తెలిపారు.ఒకవేళ ఈ ఘటనలో సంజయ్ కుటుంబీకుల ప్రమేయం నిజంగా ఉంటే, ప్రభుత్వం నిర్భయంగా విచారణ జరుపుకోవచ్చు. దానికి మాకు  ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు….

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ పోక్సో కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేయడంతో, రానున్న రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.దానికి తోడు ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు రోడ్లపై ధర్నాలు చేపట్టడం,మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విధానాన్ని తూర్పరబడుతున్నారు…

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment