బొమ్మ సత్య ప్రసాద్‌కు నివాళులర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…

Pathi Sreenivas Rao
1 Min Read

ఖమ్మం సిటీ : బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ రాజేశ్వరరావు కుమారుడు బొమ్మ సత్య ప్రసాద్ అనారోగ్యంతో పరమపదించారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు…సత్య ప్రసాద్ మరణవార్త తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హుటాహుటిన వారి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన సత్య ప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…

అనంతరం పుత్రశోకంలో ఉన్న బొమ్మ రాజేశ్వరరావు గారితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఆత్మీయంగా పరామర్శించారు. ఈ ఊహించని విషాదం పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, సత్య ప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు….

ఖమ్మం జిల్లా విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్న బొమ్మ కుటుంబంలో ఈ అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ, విద్యా రంగ ప్రముఖులు సైతం సత్య ప్రసాద్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,జిల్లా పార్టీ నాయకులు గుండాల కృష్ణ,నగర పార్టీ మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు,చిరుమామిళ్ల రవి కిరణ్, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు…

📄 Generate e-Paper Clip
Share This Article