తిరగబడ్డ మధిర కాంగ్రెస్ నాయకులు…”21వ వార్డు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పదవి అసలైన కార్యకర్తలకే ఇవ్వాలి”…

Pathi Sreenivas Rao
2 Min Read

మధిర, ఆగస్టు 6:మధిర పట్టణంలోని 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పదవి ఎంపిక అంశం స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారికి వార్డు ఇన్‌చార్జ్ పదవిని కట్టబెట్టే ప్రయత్నాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని 21వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు….

యర్రగుంట రమేష్, యర్రగుంట కమలాకర్, నల్లబోతుల నరసింహారావు వంటి నాయకులు చాలా కాలం పాటు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చి, ఇప్పుడు 21వ వార్డు ఇన్‌చార్జ్ పదవి కోసం పావులు కదుపుతున్నారని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ కాంగ్రెస్ జెండా మోస్తున్న నిజమైన కార్యకర్తలను పక్కనబెట్టి వలస నాయకులకు బాధ్యతలు ఇవ్వడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు.21వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలకు అసలు మొహం కూడా తెలియని గాలి ప్రసాద్ వంటి వ్యక్తులకు వార్డు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని,
ఈ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో శ్రమించిన వారికి కాకుండా పరిచయం లేని వ్యక్తులకు పదవులు ఇస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు….

21వ వార్డులో దాదాపు 700 మంది ఎస్సీ ఓటర్లు ఉన్నందున, వార్డు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఎస్సీ కాంగ్రెస్ నాయకత్వానికే వార్డు ఇన్‌చార్జ్ పదవిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ అంశాన్ని త్వరలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నాయకులు తెలిపారు. దీనితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు వెల్లడించారు.కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో 21వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలంతా ఏకమై తమ నిరసనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, పార్టీ కోసం శ్రమించిన వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు….

📄 Generate e-Paper Clip
Share This Article