తెలంగాణా /ఖమ్మం జిల్లా :
ఖమ్మం:ఖమ్మం నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ ‘నిర్మల స్కూల్’ అధినేత వంగా సాంబశివ రెడ్డి గారు గుండెపోటుతో అకాల మరణం చెందడం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, సాంబశివ రెడ్డి గారితో తనకు ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు…..

ఖమ్మం విద్యాభివృద్ధిలో, ముఖ్యంగా నిర్మల స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఒక విద్యావేత్తగా ఆయన చూపిన చొరవ, అంకితభావం ఆదర్శనీయమన్నారు…..

సాంబశివ రెడ్డి లాంటి వ్యక్తిని కోల్పోవడం ఖమ్మం నగరానికి, విద్యా రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకు ఎప్పటికీ పూడ్చలేని లోటని, ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.సాంబశివ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట 9703973456
