బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలి: ఖమ్మంలో బి.ఆర్.ఎస్ పార్టీ భారీ ఆందోళన !!

Pathi Sreenivas Rao
2 Min Read

ఖమ్మం, మే 11: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు సాయి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి. మైనర్ బాలికకు జరిగిన అన్యాయంపై తక్షణమే స్పందించి, నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి నాయకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు……

ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో ఒకరినొకరు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు.”సామాన్యులకు ఒక న్యాయం, అధికారంలో ఉన్నవారికి మరో న్యాయమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ‘చట్టం ముందు అందరూ సమానులే’ అని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి,” అని ఆయన ధ్వజమెత్తారు…..

బాధిత మైనర్ బాలిక కుటుంబం ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితుడిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేయకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని నాయకులు ఆరోపించారు. “బేటీ బచావో – బేటీ పడావో” అని నినాదాలు చేసే బీజేపీ నాయకులు, ఇప్పుడు తమ సొంత కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు అంతే కాకుండా సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనిన, లేనిపక్షంలో ప్రధాని మోదీ ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు…..

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, బిచ్చల తిరుమలరావు, మాజీ కార్పొరేటర్ మక్బుల్, జ్యోతి రెడ్డి, మేకల సుగుణరావు, షకీనా, ఎండీవై పాషా, కందాల వీరేందర్, సత్తార్ మియా, కోడి వీరబాబు, చిన్న నాగరాజు, ఉస్మాన్, బలుసు మురళీకృష్ణ, సతీష్, కోడిరెక్కల ఫ్రాన్సిస్, తీగల సతీష్ గౌడ్, పోలెపొంగు వెంకట్ మరియు ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article