తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతుందా? ఆయన పట్టు కోల్పోతున్నారా? అంటే కాంగ్రెస్‌లో జరుగుతున్న వరుస పరిణామాలు అవుననేలా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి మాటలను, నిర్ణయాలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, బహిరంగంగానే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారనిధి నిర్వివాదాంశం..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోలేని పరిస్థితి….
ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించడంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది,ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆయన ఓపెన్‌గా తప్పుపడుతున్నారు ఇది అసలైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస వ్యక్తులు నడుపుతున్న ప్రభుత్వమని వ్యాఖ్యానించారు అంతే కాకుండా రాహుల్ గాంధీ, కేంద్ర పార్టీ అధిష్టానం నాయకత్వంపై విశ్వాసాన్ని ప్రకటిస్తూనే, రాష్ట్ర నాయకత్వం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడ్డారు,ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రాకు చెందిన వ్యక్తులు నడిపిస్తున్నట్లు ఉందంటూ, పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయని ఆరోపించారు… రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మద్దతు లభించినప్పటికీ, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకునే సాహసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చేయలేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అంతు పట్టని విషయం….
టికెట్ల విక్రయం ఆరోపణలతో చిన్నారెడ్డి ఆవేదన…
నల్గొండ, వనపర్తి ప్రాంతానికి చెందిన నాలుగు-ఐదు దశాబ్దాల సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి సైతం బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు ,గత ఎన్నికల్లో సోనియా గాంధీ స్వయంగా తనకు టికెట్ ఇవ్వమని చెప్పినా, ఇక్కడి రాష్ట్ర నాయకత్వం డబ్బులు తీసుకుని వేరే వ్యక్తికి (మేఘా రెడ్డి) టికెట్ కేటాయించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ,48 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తే తనకు దక్కిన బహుమతి ఇదా అని ప్రశ్నిస్తూ, ఇప్పుడు తాను గొంతు విప్పితే మరొక ‘జీవన్ రెడ్డి’లా మిగిలిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు…
జిల్లాల్లో భగ్గుమంటున్న ఆధిపత్య పోరు…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాల నాయకుల మధ్య అంతర్గత గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి ముఖ్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు స్థానిక నాయకత్వంపై ఓపెన్‌గా విమర్శలు చేశారు .అక్కడ వర్గపోరు హత్యాయత్నాలు, దాడుల వరకు వెళ్లడం కాంగ్రెస్‌లో విచ్ఛిన్నకర వాతావరణానికి నిదర్శనం అదే విధంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ వ్యక్తిగత దూషణలకు దిగడం విశేషం , కరీంనగర్
జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు, ఒకరినొకరు విమర్శించుకోవడం సర్వసాధారణమైంది….
కొండా సురేఖ కూతురు రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు….
వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్‌కు హాజరుకాకపోవడం పార్టీలోని క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎత్తిచూపింది , సీఎం.రేవంత్ పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని రేవంత్ పిలుపునివ్వడంపై కొండా సురేఖ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది,కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని—ఆయనను “సీల్డ్ కవర్ సీఎం” అని సంబోధించారు.అధిష్టానం అనుకుంటే త్వరలోనే మరో సీల్డ్ కవర్ సీఎం వస్తారని, సీఎం కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఓపెన్‌గా వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది…
”హైకమాండ్‌కు విధేయులు.. సీఎంపై మాత్రం విమర్శలు”
వ్యాఖ్యలు చేస్తున్న నేతలందరూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు, జాతీయ కాంగ్రెస్‌కు విధేయత ప్రకటిస్తున్నారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి మాత్రం విధేయత చూపడం లేదు “మాకు అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రే కారణం” అని బహిరంగంగా నాయకులు మాట్లాడటం రేవంత్ బలహీన పడుతున్నారు అనడానికి స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు ,అంతే కాకుండా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని అందుకే సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రభుత్వంలో పనులేమీ జరగడం లేదని, గత ప్రభుత్వమే నయమని వ్యాఖ్యానించారు,మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదని, సీఎం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు అదే విధంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, మళ్లీ BRS కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ,రేవంత్ రెడ్డిపై నమ్మకంతో వచ్చిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు “ఆయన నాయకత్వాన్ని నమ్మలేకపోతున్నాం” అని చెప్పడం రేవంత్ ఇమేజ్‌కు పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు…
పార్టీ, ప్రభుత్వంపై పట్టు కోల్పోతున్న రేవంత్ రెడ్డి?
ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యంత యాక్టివ్‌గా, అధిష్టానం వద్ద, రాష్ట్ర నాయకత్వం వద్ద బలమైన పట్టు ఉన్న నాయకుడిగా కనిపించారు.కేబినెట్ భేటీల్లో మంత్రులకు క్లాస్ పీకే స్థాయిలో ఉన్న రేవంత్ పరిస్థితి, ఈరోజు చిన్న కార్యకర్త నుంచి సీనియర్ నేతల వరకు, చివరకు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ ఆయన నిర్ణయాలను తప్పుపట్టే స్థాయికి చేరింది ముఖ్యమంత్రి నాయకత్వంలో పగుళ్లు రావడం, పట్టు సడలడం వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూరే ప్రమాదం ఉందని, ఇలాంటి అసమ్మతి గొంతులు మరింత పెరిగితే తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య, కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చుననేది స్పష్టం అవుతుంది….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
