తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుండటంతో, ఈ వివాదం ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరినట్లు తెలుస్తోంది,కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది…కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు,తన కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ చెప్పడం, అలాగే ఆ వ్యాఖ్యలను కనీసం ఖండించకపోవడం పట్ల పార్టీ అధిష్టానం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది,ఇప్పటికే ఆమెకు అనేకసార్లు అవకాశాలు ఇచ్చామని, ఇకపై సహించేది లేదనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది…
తీసుకోబోయే చర్యలపై చర్చలు…
సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే పార్టీ మొగ్గు చూపుతోంది ఆమెను ఎలా తొలగించాలనే దానిపై ప్రస్తుతం పార్టీలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా మారిన ఇటువంటి వ్యక్తులను తక్షణమే ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు …
బజార్ సంస్కృతిపై మండిపడ్డ ఎమ్మెల్యేలు…
ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేసినా, పార్టీ అంతర్గత విషయాలపై తప్పుడు పద్ధతిలో మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు ,పొలిటికల్ ఫ్యామిలీ అని చెప్పుకునే వారు రాజకీయ విలువలు, గౌరవాన్ని కాపాడుకోవాలని, బజార్లకు వచ్చి మాట్లాడే ‘బజార్ సంస్కృతి’ కాంగ్రెస్ పార్టీ కల్చర్ కాదని దుయ్యబట్టారు ,ఇటువంటి వైఖరి వల్ల కార్యకర్తల్లో, ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
