కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

Pathi Sreenivas Rao
1 Min Read

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరియు అధికారంలో జరుగుతున్న పరిణామాలపై మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి,ఈ క్రమంలో ప్రభుత్వం, అవినీతి మరియు కాంట్రాక్టర్ల తీరుపై రాజగోపాల్ రెడ్డి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు,తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్ పార్టీలో మరియు ప్రభుత్వంలో పెద్ద పదవులు లభించాయని ఆయన అభిప్రాయపడ్డారు,మొదటి నుండి పార్టీని నమ్ముకుని పనిచేసిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు మరియు తెలంగాణ ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కాలని వారికీ సరైన న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు…

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను అప్పులపాలు చేసి దోచుకున్న సీమాంధ్ర కాంట్రాక్టర్లే, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కంటిన్యూ అవుతున్నారని ఆయన ఆరోపించారు,ఈ ప్రజాధనం వృథా, అవినీతి దోపిడీని తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు,తాను చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా లేవని, సరిదిద్దుకునేలా శ్రేణులను, అధికారులను అలర్ట్ చేసేందుకేనని పేర్కొన్నారు,అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడమే తన నైజమని తెలిపారు…అంతే కాకుండా తన వ్యాఖ్యలకు మంత్రి పదవి రాకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు,పదవుల కేటాయింపు అంశం పూర్తిగా కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీ నిర్ణయమని స్పష్టం చేశారు….

మరోవైపు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఎవరు మాట్లాడినా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తుంది,మొత్తానికి, సొంత ప్రభుత్వ వైఫల్యాలు మరియు కాంట్రాక్టర్ల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫోన్ సంభాషణ తీవ్ర చర్చనీయాంశమైంది….

📄 Generate e-Paper Clip
Share This Article