తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఒక తీవ్రమైన సమస్యను లేదా సంక్షోభాన్ని ఎదుర్కోవడం సాధ్యం కానప్పుడు, అసలు సంబంధం లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేరును తీసుకొచ్చి రాజకీయం చేయడమనేది తెలుగుదేశం పార్టీకి, దానికి అనుకూల మీడియాకు మొదటి నుంచీ ఉన్న అలవాటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి,తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహకుడు వేమూరి రాధాకృష్ణ తన ‘వీకెండ్ కామెంట్’ వ్యాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా రాస్తూ, జగన్మోహన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకురావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది…
కాంగ్రెస్ అంతర్గత కలహాలు – కొండా సురేఖ సుస్మిత వివాదం…
ఇటీవల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సాంప్రదాయాలను పక్కనపెట్టి, వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి రేబూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ముందే ప్రకటించారు,సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రియినా సరే ఇలాంటి ప్రకటనలు చేసే సంప్రదాయం ఉండదు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత, వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నుంచి స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారని ఘాటు ఆరోపణలు చేశారు…ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వగా, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చారు…
ఎమ్మెల్యేల మద్దతు మరియు తెరవెనుక శక్తి ఆరోపణలు…
క్రమశిక్షణ కమిటీలో విచారణ జరుగుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి వర్గం దాదాపు 45 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడితే పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేస్తామని ఆఫర్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి అయితే కేవలం 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు మాత్రమే వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టారు.వాస్తవానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సీనియర్లు అయిన మంత్రులు లేదా ఎమ్మెల్యేలు ఎవరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకపోవడం గమనార్హం కేవలం 16 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా ఉన్నందున ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా మొదలైంది….మరోవైపు కొండా సురేఖ స్పందిస్తూ – “నేను పార్టీని గౌరవించి వివరణ ఇస్తే, క్రమశిక్షణ కమిటీ విచారణలో ఉండగానే నాపై వరుసగా ఎమ్మెల్యేలు ఎలా ప్రెస్ మీట్లు పెడతారు? దీని వెనుక ఉన్న తెరవెనుక శక్తి ఎవరు?” అంటూ రేవంత్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకుండా ప్రశ్నించారు….
రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ – బిఆర్ఎస్, వైఎస్సార్సీపీ కుట్ర సిద్ధాంతం…
ఈ పరిణామాల మధ్య ఆంధ్రజ్యోతి పత్రిక “కొండా సురేఖను సాగనంపాల్సిందే – మెజార్టీ నేతల పట్టు” అంటూ కథనాలు రాయడమే కాకుండా రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో బిఆర్ఎస్, వైఎస్సార్సీపీ కలిసి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని రాశారు,మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఒక జట్టుగా మారారని రాయడాన్ని ‘కుట్ర’గా అభివర్ణించిన రాధాకృష్ణ, మరోవైపు చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డిల మధ్య పాత సాన్నిహిత్యం బలపడిందని సానుకూలంగా రాయడం వారి పక్షపాత వైఖరిని తెలియజేస్తోందని విమర్శకులు అంటున్నారు…వైఎస్సార్సీపీ – బిఆర్ఎస్ స్నేహం ‘కుట్ర’ అయితే, టీడీపీ – రేవంత్ స్నేహం ‘సాన్నిహిత్యమా’? ఇదెక్కడి దిక్కుమాలిన జర్నలిజం అంటూ జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారని పలువురు సీనియర్ జర్నలిస్టులు ఎద్దేవా చేశారు….కొండా సురేఖ దంపతులను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్‌కు పిలిపించి జగన్‌పై విమర్శలు చేయించిన రాధాకృష్ణ, ఇప్పుడు అదే సురేఖ రేవంత్ రెడ్డిని విమర్శించగానే ఆమెను జగన్ సన్నిహితురాలిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు….
రాజశేఖర్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి పోలికా….
అదే విధంగా రాయలసీమకు చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వాన్ని ఆమోదించిన తెలంగాణ నాయకులు, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారని రాధాకృష్ణ ప్రశ్నించడాన్ని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు నిజానికి వైఎస్సార్ ఎప్పుడూ టీడీపీ మీడియాకు వెళ్లి మద్దతు అడగలేదు, తన సొంత క్యాబినెట్ మంత్రులపై మీడియా ద్వారా వ్యతిరేక కథనాలు రాయించలేదు,భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లు సైలెంట్‌గా ఉండటానికి కారణం – రేవంత్ రెడ్డి తన అనుకూల మీడియాతో తమపై దెబ్బకొట్టించే ప్రయత్నాలు చేయడమేనని కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించడం గమనార్హం…
తెలంగాణ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం….
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిలా కాకుండా, టీడీపీ అజమాయిషీలో పనిచేస్తున్నారనే భావన తెలంగాణ ప్రజల్లో, సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో బలపడింది,వైఎస్సార్ రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినా ఎప్పుడూ హైకమాండ్‌ను దిక్కరించలేదు కానీ రేవంత్ రెడ్డి 2034 వరకు నేనే సీఎం అని ప్రకటించుకోవడం, ముందే అభ్యర్థులను ప్రకటించడం వంటి చర్యలతో హైకమాండ్‌ను పక్కన పెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి,రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేదా తెలంగాణ రాజకీయాల్లో బలహీనపడితే, దానికి బిఆర్ఎస్ లేదా వైఎస్సార్సీపీ కారణం కాదని; తెలుగుదేశం పార్టీ, దానికి కొమ్ముకాసే మీడియా వైఖరే ప్రధాన కారణమవుతుందని ,బిజేపితో ప్రయాణిస్తున్న చంద్రబాబు నాయుడితో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పనిచేయడమే అసలైన అనైతిక రాజకీయమని పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించడం విశేషం….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
