తెలంగాణ/హైదరాబాద్:
హైదరాబాద్: తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హెచ్.ఐ.సి.సి (HICC)లో జరిగిన సుమారు 9వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు సున్నితమైన సెటైర్లు వేసుకుంటూనే, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు,వేదికపై తొలుత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. “గతంలో మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గుజరాత్ అభివృద్ధికి ఎలాగైతే సహకరించారో, అదే విధంగా తెలంగాణ పట్ల వివక్ష చూపకుండా నిధులు ఇవ్వాలని” కోరారు 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యమని, దీనికి ప్రధాని ఆశీస్సులు కావాలని ఆయన విన్నవించారు….
ప్రధాని మోదీ చమత్కారపూరిత సమాధానం….
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రధాని మోదీ నవ్వుతూ ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు. “మీరు చెప్పినట్లు మన్మోహన్ సింగ్ గారు గుజరాత్‌కు ఇచ్చినంత నిధులు నేను తెలంగాణకు ఇస్తే, ఇప్పుడు వస్తున్న నిధుల్లో మీకు సగం కూడా రావు” అని పేర్కొన్నారు,యూపీఏ హయాంలో రైల్వే నిధుల కంటే ఇప్పుడు తాము మూడు నాలుగు రెట్లు అధికంగా ఇస్తున్నామని గుర్తు చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి వైపు చూస్తూ “మేరే సే జోడో” (నాతో కలిసి నడవండి) అని పిలుపునిచ్చారు,తెలంగాణ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో కలిసి నడవాలని ఆయన సూచించారు…..
రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న ప్రధాని వ్యాఖ్యలు….
గతంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉండేవారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రోటోకాల్ పాటిస్తూ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు. అయితే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ “బిజెపి-కాంగ్రెస్ ఒక్కటే” అని విమర్శిస్తున్న తరుణంలో, మోదీ చేసిన ఈ “నాతో కలవండి” అనే వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి,
రేవంత్ రెడ్డి ఈ “ఆహ్వానాన్ని” కేవలం అభివృద్ధి పరంగా తీసుకుంటారా లేక రాజకీయంగా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
