కుట్రలను చేధిస్తాం….సత్యమే గెలుస్తుంది: కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన!!

Pathi Sreenivas Rao
2 Min Read

హైదరాబాద్:తనపై,తన కుమారునిపై వస్తున్న నిరాధారమైన ఆరోపణలు, రాజకీయ విమర్శలపై కేంద్ర మంత్రి ఘాటుగా స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇలాంటి కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది.నా జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే పనిచేశాను. దశాబ్దాలుగా ప్రజల మధ్యే ఉంటూ మచ్చ లేని రాజకీయ జీవితాన్ని గడుపుతున్నానని గర్వంగా చెప్పగలను” అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతికతను పాటిస్తున్న తనపై బురదజల్లడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యర్థులు తనను నేరుగా ఎదుర్కోలేక తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం వారి నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందని మంత్రి విమర్శించారు. “ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనుకబడిన వర్గాలకు (BC) చెందిన వ్యక్తి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అట్టడుగు స్థాయి నుంచి కార్పొరేటర్‌గా, ఎంపీగా ఎదిగి నేడు దేశానికి సేవ చేస్తున్నాను. నా ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఈ కుట్రలకు తెరలేపారు” అని ఆయన మండిపడ్డారు….

రేపు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో, తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయడమే ఈ ఆరోపణల వెనకున్న అసలు లక్ష్యమని ఆయన విశ్లేషించారు. సభ విజయవంతం కాకుండా చూసేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రత్యర్థులు పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.”తప్పేదో.. ఒప్పేదో”.. న్యాయవ్యవస్థే నిర్ణయిస్తుంది.కాలం ప్రతి ఆరోపణకు సమాధానం చెబుతుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది. చివరకు సత్యమే గెలుస్తుంది, ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మంత్రికి మద్దతుగా పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment