ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీలో నూతన ఉత్తేజం:పన్నెండు మండలాలకు అధ్యక్షుల నియామకం!!

Pathi Sreenivas Rao
1 Min Read

ఖమ్మం: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత క్షేత్రస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని పలు మండలాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ సంయుక్తంగా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నియామకాల్లో సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత కలిగిన నాయకులకు ప్రాధాన్యత కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి….

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నియామకాల చేపట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన అధ్యక్షులు చురుకైన పాత్ర పోషించాలని సీనియర్ నాయకులు సూచించారు,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయడంలో మండల అధ్యక్షులు సమన్వయకర్తలుగా వ్యవహరించాలని ఆదేశించారు. తమపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి నూతన అధ్యక్షులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ నియామకాలతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు మరింత ఉధృతంగా కొనసాగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article