తెలంగాణ/ఖమ్మం సిటీ:
ఖమ్మం సిటీ: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ల పదవీకాలం ఈనెల 7న ముగుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ అయిదు సంవత్సరాల పాటు ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అదృష్టం కార్పొరేటర్లుగా మీకు లభించిందని,ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీరు కార్పొరేటర్లుగా గెలిచారని ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఎప్పుడు ప్రజల్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు…..

కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్….
అదే విధంగా ఇటీవల కాలంలో పార్టీని వదిలి వెళ్ళిన కార్పొరేటర్లపై మండిపడ్డారు,రాజకీయ పరిపక్వత లేని వాళ్ళే నన్ను వదిలి పోయారని,రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు నాతో ఉన్నారని,పార్టీ మారినోడి పరిస్థితి కన్నా పార్టీలో ఉన్నవాళ్ల పరిస్థితి మెరుగ్గా ఉందని,ఎవరు పోయిన ఇప్పుడు కార్పొరేషన్ పాలించే వాళ్ళకు నేను పెట్టిన బిక్షేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు,అంతే కాకుండా నన్ను నమ్మి ఈరోజు నాతో ఉన్న వాళ్ళకు ఈరోజే టికెట్లు ఏనౌన్స్ చేస్తున్నానని,మీరు చేసిన సేవలు ఎప్పటికి మర్చిపోనని,మన ప్రవర్తన బట్టే ప్రజలు మనల్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు….

కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లు,కార్యకర్తలు….
అదే విధంగా ఈ రోజునుండి అనునిత్యం ప్రజల్లో ఉండి,
బి. ఆర్.ఎస్ హయాంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను గడప గడపకు తిరిగి ప్రజలకు వివరించాలని,రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కష్టపడి అత్యధిక స్థానాలు గెలవాలని పిలుపు నిచ్చారు….

కార్పోరేటర్లను సన్మానిస్తున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్….
అనంతరం కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ,షేక్ మక్బుల్,దండా జ్యోతిరెడ్డి,నాగండ్ల కోటేశ్వరరావు,కూరాకుల వలరాజు,శీలంశెట్టి రమ వీరభద్రం,తోట గోవిందమ్మ రామారావు,మాటేటి అరుణ నాగేశ్వరరావు,బిక్కసాని ప్రశాంతి లక్ష్మి జస్వంత్,పసుమర్తి రామ్మోహన్,బుర్రి వెంకట్ కుమార్,బుడిగం శ్రీనివాస్,ముక్కాల కమల,పల్లా రోజ్లీనా,పగడాల శ్రీవిద్య లకు సన్మానం చేశారు.కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ RJC కృష్ణ,మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,మాజీ గ్రంధాలయం చైర్మన్ ఖమర్,మాజీ సొసైటీ చైర్మన్ బీరెడ్డి నాగచంద్ర రెడ్డి,మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, నాయకులు అమరగాని వెంకన్న,గాదె అనీల్ కుమార్,మిర్చిశాఖ అధ్యక్షులు మెంతుల శ్రీశైలం,లీగల్ సెల్ కొత్త వెంకటేశ్వరరావు,మహిళా నాయకురాలు కొల్లు పద్మ, షకీనా,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
