తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఏదులాపురం:నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. మున్సిపాలిటీ పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూ. 75 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్ణయం తీసుకున్నారు….
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన
వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్…
ఈ భారీ నిధుల కేటాయింపుపై ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్ హర్షం వ్యక్తం చేశారు.ఆదివారం తన కార్యాలయంలో “జనం ముచ్చట”తోbమాట్లాడుతూ…ఏదులాపురం అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఉన్న ప్రత్యేక అభిమానానికి ఈ నిధులే నిదర్శనమని కొనియాడారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదులాపురం మున్సిపాలిటీకి ఒకేసారి రూ.75 కోట్ల రూపాయలు కేటాయించడం చారిత్రాత్మకమని,ఈ నిధులతో పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో పార్కుల అభివృద్ధి చేపడతామని తమ్మినేని నవీన్ పేర్కొన్నారు,ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి
కృతజ్ఞతలు తెలియజేశారు అంతే కాకుండా ఎదులాపురం మున్సిపాలిటీ అభివృద్దికి అన్ని విధాల సహకరిస్తున్న మంత్రి పొంగులేటి కార్యాలయం ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు….
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
