తెలంగాణ/ఖమ్మం జిల్లా:
నేలకొండపల్లి : “మీ కష్టాలను వినేందుకు, మీ కన్నీళ్లు తుడిచేందుకే ప్రభుత్వం మీ గడప వద్దకు వచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు మేము విశ్రమించం” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. శనివారం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’లో ఆయన పాల్గొని, జనంతో నేరుగా మమేకమయ్యారు…..

ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి….
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్లుగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గమనించే తమ ప్రభుత్వం ‘ప్రజల వద్దకే పాలన’ను తీసుకువచ్చిందని చెప్పారు. “రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే నెలాఖరులో రెండో దశ మంజూరు చేస్తాం. ప్రతి సోమవారం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాం” అని స్పష్టం చేశారు…..

కార్యక్రమంలో ప్రజలతో మమేకం అవుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి….
అంతే కాకుండా సమస్యల ద్వారా రైతులు పడుతున్న ఇబ్బందులను రాబోయే రెండు నెలల్లో పరిష్కరించి, రైతులకు మేలు చేకూరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దివాకర్‌తో కలిసి మంత్రి గంటల తరబడి ప్రజల మధ్యే ఉండి వందలాది మంది ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి వారం దీనిపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు…..

ప్రజాదర్బార్ కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
