ఖమ్మం సిటీ BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!!

Pathi Sreenivas Rao
2 Min Read
...

ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు లకారం ట్యాంక్ బండ్ పై ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు,అనంతరం ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడని,సామాన్య ప్రజల హక్కుల కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప యోధుడు పాపన్న గౌడ్ అని,ఆయన చూపిన ధైర్యం, త్యాగం, నాయకత్వం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు….

అదే విధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహనీయుల జయంతులను కేవలం ఆచారంగా మాత్రమే నిర్వహిస్తూ,వారి ఆశయాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.సామాన్య ప్రజల సంక్షేమం, బలహీన వర్గాల అభివృద్ధి,యువతకు ఉపాధి వంటి అంశాల్లో ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల ప్రకారం ప్రజలకు న్యాయం జరిగే విధంగా పాలన ఉండాలని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు…..

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ గారు, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, రఘునాధపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర వీరు నాయక్, కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మక్బూల్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ప్రచార కార్యదర్శి షకీనా, ఖమ్మం త్రీ టౌన్ యూత్ కన్వీనర్ మాటేటి కిరణ్, లింగన్న బోయిన సతీష్, పొదిలి నాగరాజు, ఆరింపుల వీరభద్రం, SC సెల్ ఒకటో పట్టణ SC సెల్ కన్వీనర్ నెమల కిషోర్,ఉబ్బనపల్లి నిరోషా, చిట్టెంశెట్టి పరమేష్, కోడి రెక్కల ఉమాశంకర్, కందాల వీరేందర్, BRTU ఆటో యూనియన్ నాయకుడు సత్తార్మియా, ఉస్మాన్, రఫీ, గోగుల వీరన్న, నన్నే, కోటి, మదర్, తోడేటి లింగరాజు, నాగేశ్వరరావు, పోలే పొంగు వెంకట్, సాజిద్, కర్ణకోటి ఉపేందర్, కూచిపూడి కిషోర్, మాధవి, ప్రవీణ్, సందీ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment