తెలంగాణ/ఖమ్మం జిల్లా:
ఖమ్మం జిల్లా కార్మిక శాఖ పరిధిలో అమలు చేస్తున్న లేబర్ ఇన్సూరెన్స్ పాలసీల్లో భారీ మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ మోసాల వల్ల వేలాది కార్మికులు నష్టపోయినట్టు సమాచారం,కాంట్రాక్ట్ సంస్థలు, మధ్యవర్తులు కలిసి కార్మికుల పేర్లపై నకిలీ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని, ప్రీమియం మొత్తాలను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని కేసుల్లో కార్మికుల అసలు వివరాలు లేకుండానే పాలసీలు జారీ చేయబడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి….
తాజాగా ఖమ్మం జిల్లా లేబర్ కార్యాలయంలో తిష్టవేసిన జిల్లాకు చెందిన ఓ మంత్రికి సంబంధించిన సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరిస్తూ,అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి ప్రధాన అనుచరునికి అన్ని తానై,తలలో నాలుకలా వ్యవహరించే ఓ వ్యక్తి కొంతమంది ఏజెంట్లతో కలిసి దోపిడి పర్వానికి తెరలేపారు,ముఖ్యంగా నకిలీ మరణ ధ్రువ పత్రాలను సృష్టించి తప్పుడు ఇన్సూరెన్స్ క్లైములు చేస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నట్లు
ఆరోపణలు వస్తున్నాయి,ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయం గురించి కొందరు బాధితులు “జనం ముచ్చట”ను ఆశ్రయించారు,మాకు లేబర్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పినా సదరు వ్యక్తి మమ్మల్ని పట్టించుకోకుండా లంచం ఇస్తే తప్ప మీ ఫైలు కదలదని తెగేసి చెబుతున్నాడని,ఏదైనా ఉంటే మా ఏజెంటును పంపిస్తా అతనితో మాట్లాడుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని బాదితులు వాపోతున్నారు…..
సదరు వ్యక్తి పంపించిన ఏజెంట్ కలువగా మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలంటే నలబై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పగా మేము ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని కాళ్ళ,వ్రేళ్ళపడి బ్రతిమాలినా కనికరం లేకుండా చివరకు ఇరువై అయిదు వేల రూపాయలు (ఫోన్ పే ద్వారా పదిహేను వేలు,చేతినుండి పదివేలు)ఇస్తే గాని పైల్ కదలిక రాలేదని,అన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఇన్సూరెన్స్ డబ్బులు మా ఖాతాల్లోకి రాలేదని, అదేమని అడిగితే నువ్విచ్చిన పాతిక వేలకు అప్పుడే లక్షలకు లక్షలు వచ్చి పడతాయా కొద్ది రోజులు ఆగరాదు అంటూ నిర్లక్ష్య ధోరణిలో సమాధానం చెబుతున్నాడని బాదితులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు….
అంతే కాకుండా ఇదే లేబర్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ముఠా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో పన్నెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు,నకిలీ లేబర్ ఇన్సూరెన్స్ పత్రాలను సృష్టించి దాదాపు పది లక్షల రూపాయలు క్లెయిమ్ చేసి బాధితులకు రెండు లక్షల రూపాయలు ఇచ్చి మిగతా ఎనిమిది లక్షల రూపాయలు కాజేశారు,ఈ విషయం ఆనోటా,ఈ నోటపడి ఓ ప్రధాన దినపత్రిక వార్తా కథనం ప్రచురించడంతో స్పందించిన అధికారులు ఆ సొమ్మును రికవరీ చేసినట్లు వార్తలు వచ్చాయి అదే క్రమంలో సదరు ఏజెంట్లపై అధికారులు క్రిమినల్ కేసు చేయాలనుకున్న నేపథ్యంలో తన అనుంగు శిష్యుణ్ణి కాపాడుకునే యత్నంలో బాగంగా రంగంలోకి దిగిన మంత్రి ప్రధాన అనుచరుడు అధికారులను బెదిరించి కేసు పెట్టకుండా నివారించిన్గట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి,దీంతో రెచ్చిపోయిన సదరు ఏజెంటు జిల్లా కార్మిక అధికారిని సైతం లెక్క చేయడం లేదని, అతన్ని చూస్తే అధికారులు సైతం భయపడుతున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కార్మిక శాఖ అధికారి “జనం ముచ్చట” తో చెప్పడం విశేషం…….
రాజకీయ అండదండలతో రెచ్చిపోతూ,అధికారులను సైతం లెక్క చేయకుండా “లేబర్ ఇన్సూరెన్స్” కార్యాలయంలో అక్రమ దందాలకు పాల్పడుతున్న “ఏజెంట్ల ముఠా” నాయకుడు గత ఆరు నెలలుగా నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృస్టించి చేస్తున్న అక్రమ ఇన్సూరెన్స్ క్లైములు,తద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్న వ్యవహారంపై పూర్తి ఆధారాలతో వరుస కథనాలు….మీ “జనం ముచ్చట” న్యూస్ లో రేపటి నుండి గమనించ గలరు
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
