జనం ముచ్చట, ములుగు జిల్లా!!
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయతో కలిసి ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు సన్మానం సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలై.. పార్లమెంట్, ఉప ఎన్నికలు, మొన్నటి పంచాయతీ ఎన్నికలు, తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల దాకా ప్రజలు కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా ప్రజలవ్ ఆశీర్వదించారని అన్నారు,ఎన్నిక ఏదైనా తీర్పు ‘వన్ సైడ్’గానే ఉందని,ఇది జీర్ణించుకోలేని గత పాలకులు ఒంటి నిండా విషాన్ని నింపుకుని కుట్రలు చేస్తున్నారని,ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు, ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు….

ప్రజా విజయాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం!
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన వారు ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని పొంగులేటి ధ్వజమెత్తారు. “అప్పుల రాష్ట్రంలోనూ మేము పేదవాడి ప్రేమను పొందుతూ, వారు చేయలేని పనులు చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలకు అరగడం లేదని అందుకే ముఖ్యమంత్రిపై, మంత్రులపై అవాకులు చెవాకులు పేలుతున్నారని నిజం చెప్పే ధైర్యం, జ్ఞానం వారికి ఆ దేవుడు ఇవ్వలేదని మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాత సీట్ల కంటే మరో 10 స్థానాలు అదనంగా గెలిచి, తెలంగాణ గడ్డపై మరోమారు మూడు రంగుల జెండా రెపరెపలాడటం ఖాయం” అని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు…..

లక్ష కోట్లు దోచారు.. పాలెం వాగును వదిలేశారు
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. “దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పాలెం వాగు ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే, పదేళ్ల పాలనలో దానిని పూర్తి చేయాలనే జ్ఞానం వీరికి రాలేదు 15 వేల ఎకరాలకు నీరు రావాల్సి ఉంటే, కేవలం 3-4 వేల ఎకరాలకే ప్రస్తుతం నీరు అందుతోంది రెండు మూడు రోజుల్లోనే సీతక్క, నేను, ఇరిగేషన్ మంత్రి చర్చించి, రాబోయే వర్షాకాలం పంట నాటికి పాలెం వాగు మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని అలాగే రాళ్లవాగు వంతెనను కూడా ఇదే సీజన్లో పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు….

అధికార తాళం చెవి మీ దగ్గరే ఉండాలి!
కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు “మీరు ఎన్నికయ్యారు.. పరిపాలన కూడా మీరే చేయండి. అధికార తాళం చెవులను భర్తల చేతికి ఇచ్చి మీరు వెనుక ఉండకండి అంటూ మహిళా సర్పంచులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు,మంత్రి సీతక్క ఏ విధంగా ధైర్యంగా పాలిస్తున్నారో, మీ గ్రామ పంచాయతీల్లో మీరు కూడా అదే విధంగా పాలించి ఆదర్శంగా నిలవాలి” అని సూచించారు,ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), స్థానిక పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు……
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
