జనం ముచ్చట,ములుగు జిల్లా:
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సహచర మంత్రి సీతక్క,స్థానిక ప్రజాప్రతినిధులు,జిల్లా కలెక్టర్, అధికారులు, గుత్తేదారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు,ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకొన్నారు,ఆ తరువాత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మేడారంలో ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులతో చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో సమీక్షించారు,జంపన్న వాగు, హరిత, ఊరట్టం, చిలకల గుట్ట, ఆర్ టి సి జంక్షన్ లను పరిశీలించారు,జాతర అనంతరం మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు….

మేడారం పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి….
జాతరకు ముందే 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మిగతా 5 శాతం పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు,జనవరిలో జరిగిన మేడారం జాతరకు 1.55 కోట్ల మంది విచ్చేశారని అంచనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో మంత్రులు సీతక్క, కొండ సురేఖ,అడ్లూరి లక్ష్మణ్,ఎంపీ బలరాం నాయక్,కలెక్టర్,ఎస్పీ అధికారులందరి సమన్వయంతో, మీడియా సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా జాతర నిర్వహించడం వలన విజయవంతం అయ్యిందని ఇందుకు సహరించిన ప్రతిఒక్కరికీ మంత్రి పొంగులేటి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేశారు…..

మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…..
రెండేళ్లకోసారి వచ్చే జాతర మేరకే కాకుండా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా రాతికట్టడాల పనులు పూర్తి చేశామని, అభివృద్ధి చెందిన మేడారాన్ని చూడడానికి ఇకనుండి శని, ఆదివారాలు మరియు ప్రతి సెలవు దినాలు భక్తుల తాకిడి ఉంటుందని,దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు,
అదే విధంగా ఏడాది పొడుగునా జంపన్న వాగులో నీరు ఉండేలా, గోదావరి నీటిని తెచ్చే విషయంపై గత నెలలో ఇక్కడే జరిగిన కేబినెట్ లో నిర్ణయించడం జరిగిందని,అంతే కాకుండా జంపన్న వాగుపై మొదటి విడత 5 చెక్ డ్యాంల పనులు త్వరలోనే మొదలుపెడతామని ఇక్కడ ఉన్న రెండు ఇరిగేషన్ ట్యాంకులను సుందరీకరణ చేయబోతున్నామని తెలిపారు,అలాగే జాతర సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియా రోడ్లను వెడల్పు చేయడం కోసం గతంలో సుమారు 29 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేశామని.ఇంకా అవసరమైన భూమిని కూడా సేకరిస్తామని మంత్రి పొంగులేటి తెలియజేశారు….

మంత్రిసీతక్కతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…..
అదే విధంగా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను అన్నింటినీ అభివృద్ధి చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని రాబోయే కొద్ది రోజుల్లో వాటికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయని,గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు…..
జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
