జనం ముచ్చట,ఖమ్మం జిల్లా:
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు తొలగింపు నేపథ్యంలో ఈరోజు మల్కాజగిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ఈ రోజు భూదాన్ భూముల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు, ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పేదల గుడిసెలు కూల్చి గత ఐదు రోజులుగా వెలుగుమట్ల బాధితుల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని,ఈ క్రమంలో యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం బాధితులకు సంఘీభావం తెలపడమే కాకుండా ఈ దుర్మార్గపు ప్రభుత్వం కూలిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారని,ఆనాటి కేసిఆర్ అహంకారపు ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టంగట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది ఖమ్మం జిల్లా అని,ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో పేదల గుడిసెలు కూలగొట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు….

భూదాన్ భూముల పరిశీలనకు వస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్….
అంతే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిస్ట్రక్షన్ ,డిమాలిషన్ అనే ఎజెండా పెట్టుకుని అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హైదరాబాద్ లో హైడ్రా పేరిట, మూసి నది ప్రక్షాళన పేరిట పేదలను ఇండ్లను కూల్చివేస్తున్నారు,ఈ రోజు ఖమ్మంలో కూడా భూదాన్ భూముల పేరిట పేదల ఇండ్లను కూల్చి వందల కుటుంబాలను నిరాశ్రయులను చేశారు, కన్న ఊరులో ఉపాధి లేక, కని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి పొట్ట చేతబట్టుకుని బ్రతకడానికి వచ్చి,రెక్కాడితే గాని డొక్కాడని అభాగ్యుల గుడిసెలను కూలగొట్టడానికి ఈ ప్రభుత్వానికి మనసేలా వచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,పేదవాడికి నిలువ నీడ ఉండాలనే మహానుభావుడు వినోబా భావే పిలుపునందుకుని మానవత్వం ఉన్న భూస్వాములు వేలాది ఎకరాలు దానం చేశారు అలా దానం చేసిన భూముల్లో వెలుగుమట్ల భూదాన్ భూములు కూడా ఒకటి,సర్వే నెంబర్ 147,148,149 ఈ మూడు సర్వే నెంబర్లలో అరవై రెండు ఎకరాల ఏడు కుంటలు భూమిలో 2014 నుండి ముప్పై రెండు ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకుని ప్రజలు జీవిస్తున్నరూ,ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కూడా పేదల గుడిసెలను కూల్చివేసే ప్రయత్నం చేసింది కానీ ప్రజల ఐక్యత ముందు,పోరాటం ముందు అలాంటి కుటిల యత్నాలు సాగలేదు,కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షగట్టి పేదల గుడిసెలను కూల్చివేసిందని అన్నారు….

భూదాన్ భూముల్లో కూల్చిన పేదల గుడిసెలను పరిశీలిస్తున్న ఎంపీ.ఈటెల రాజేందర్…..
వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు మాకు కరెంట్,నీళ్లు,రోడ్లు వంటి మౌళిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం లేదంటు,న్యాయం చేయాలని అనేకసార్లు కోర్టు మెట్లు ఎక్కితే ఆనాడు వాళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోర్టు తీర్పు ఇచ్చింది,కానీ కోర్టు ఆదేశాలు సైతం పక్కనబెట్టి ఎటువంటి సదుపాయాలు కల్పించక పోయినా సొంతంగా సోలార్ ప్లాంట్లు పెట్టుకుని జీవిస్తున్నారంటే ఇక్కడ అధికారులు,అధికార పార్టీ నాయకులు మనుషులా పశువులా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,బాదితులు అంత కలిసి మాకు పట్టాలు ఇచ్చారు మౌలిక వసతులు కల్పించండని కోర్టుకు వెళితే ఈ విషయాన్ని పరిశీలించండని కోర్టు CCLA కమీషనర్ కు ఆదేశాలిస్తే తెల్లవారుజామున దొంగల్లాగా నాలుగు వేలమంది పోలీసులు, రెవెన్యూ అధికారులతో పేదల గుడిసెలను కూలగొట్టారు పేదల గుడిసెలను కూల్చమని
ఏ కోర్టు ఆదేశాలిచ్చిందని నిలదీశారు….

వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్…..
ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి దమ్ముంటే లక్షల ఎకరాల భూదాన్ భూములు,లక్షల ఎకరాల ఎసైండ్ భూములు ఎవరి చేతిలో ఉన్నాయో లెక్క తేల్చే దమ్ము,ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు,పెద్ద వాళ్ళు కట్టుకున్న విల్లాల జోలికిపోరు,పెద్దవాళ్ళు నిర్మించుకున్న ఫామ్ హౌజుల జోలికిపోరు,పెద్ద వాళ్ళు నిర్మించుకున్న ఫంక్షన్ హాల్స్ జోలికిపోరు వీళ్ళ కండ్లకు కనబడేది పేదలు వేసుకున్న్గుడిసెలు మాత్రమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు,146,147,148,149 సర్వే నెంబర్లలో అరవై రెండు ఎకరాల భూదాన్ భూములు ఉంటే దాంట్లో పేదలు గుడిసెలు నిర్మించుకున్నది కేవలం ముప్పై రెండు ఎకరాల్లో మాత్రమే మిగిలిన ముప్పై ఎకరాల భూమిని ఎవరికి క్లెయిమ్ చేస్తున్నవంటూ ఈ సందర్భంగా కలెక్టర్ ను నిలదీశారు,ఆనాటి రెవెన్యూ అధికారులు దొంగతనంగా ప్రవేటు వాళ్లకు కట్టబెట్టిన విషయం బయట పెట్టగలరా అంటూ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు,IAS,IPS లు చదివి మంత్రుల అడుగులకు మడుగులొత్తుతూ బానిసలు లాగా పని చేస్తూన్నారు తప్ప నిజ నిజాలేంటో ,న్యాయం అన్యాయం ఏమిటో తేలుకునే పరిస్థితులలో లేరంటూ తీవ్రంగా మండి పడ్డారు,ఇప్పటికైన మీ వైఖరి మార్చుకుని వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలని అధికారులను,మంత్రులను కోరారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట,న్యూస్ హైదరాబాద్:9703973456
