ఖమ్మం జిల్లా “దిశ” సమావేశంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రచ్చ రచ్చ!!

Pathi Sreenivas Rao
1 Min Read
కలెక్టర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ తాత మధుసూదన్....

ఈ రోజు ఖమ్మం ఐడివోసి కాంప్లెక్స్ లో దిశ చైర్మన్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాం రెడ్డి , జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఖమ్మం జిల్లా అభివృద్ధి సమన్యాయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ ) సమావేశం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్సీ,BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ తనకు ఆహ్వానం లేదంటూ కలెక్టర్ పోడియం ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు….

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ
ఒక ప్రజాప్రతినిధినైన నాకు దిశా సమావేశం జరుగుతున్నట్లు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు,ఈ క్రమంలో సమావేశానికి సమాచారం ఇవ్వకపోవడంపై దిశ కమిటీ చైర్మన్, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామ సహాయం రఘురామిరెడ్డి నీ నిలదీశారు,జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,
విపక్ష ప్రజా ప్రతినిధులపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు…..

ఈ క్రమంలో ఎంపీ రఘురామ రెడ్డి జోక్యం చేసుకుని మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామని తాత మధును సముదాయించినప్పటికీ వినిపించుకోకుండా నిరసన వ్యక్తం చేశారు,ఇలాంటి పొరపాటు మరోసారి జరగదని కలెక్టర్ హామీ ఇవ్వాలని పట్టుబట్టారు దీంతో కలెక్టర్ ఇలాంటి మిస్ కమ్యూనికేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment