రాజకీయ దుమారం లేపుతున్న ఖమ్మం ఆర్డీవో బదిలీ!!

Pathi Sreenivas Rao
2 Min Read
బదిలీకి గురైన ఖమ్మం ఆర్టీవో గరిడి నరసింహారావు.....

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య ఉన్న ఆధిపత్యపోరు ఆర్డీవో బదిలీకి దారితీసింది, ప్రస్తుతం ఈ అంశం ఖమ్మం జిల్లాలో రాజకీయ దుమారం లేపుతుంది,మూడు రోజుల క్రితం జరిగిన భూదాన్ భూముల్లో ఆక్రమణలు తొలగింపు విషయంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విబేధాలు పొడచూపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి,రెవెన్యూ మంత్రిగా నాకు తెలియకుండా గుడిసెల కూల్చివేత ఎలా చేపడతారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కొన్ని మీడియా చానెళ్లలో ప్రచారం జరిగింది,కారణాలు ఏమైనప్పటికి రాజకీయ ఆధిపత్య పోరులో అధికారులను బలి పశువులను చేస్తున్నారంటూ రెవెన్యూ ఉద్యోగ సంఘాల్లో ,ఇటు మీడియాలో,రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది….

భూదాన్ భూముల్లో ఆక్రమణల కూల్చివేత ఆర్డర్లు ఇచ్చిన
పై అధికారులను వదిలేసి ఆర్డర్లను అమలు చేసిన ఆర్డీవో లాంటి క్రింది స్థాయి అధికారిణి బదిలీ చేయడమేమిటని రెవెన్యూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు,కూల్చివేత అంశం మంత్రికి చేరవేయాల్సిన బాధ్యత ఎవరిది? మంత్రికి చెప్పకుండా కూల్చివేత ఆర్డర్లు ఇచ్చిన పై అధికారులను వదిలేసి క్రింది స్థాయి అధికారులను బలి చేయడం ఏమిటని నిలదీస్తున్నారు,ఎడ్లు ఎడ్లు కొట్టుకుంటుంటే మధ్యలో లేగ దూడలు కాళ్లు విరిగినట్లు మంత్రుల మధ్య నలుగుతున్న రాజకీయ ఆదిత్య పోరులో ఉద్యోగులు సమిధలు అవుతున్నారని ఎంప్లాయీస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు….

ఉద్యోగస్తుల వర్షన్ అలా ఉంటే ఆర్డీవో బదిలీ విషయంలో బీసీ,ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ సంఘాల ప్రకటనలు ఆసక్తికరంగా ఉన్నాయి,జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా బీసీ,ఎస్సీ, ఎస్టీ , మైనారిటీలకు చెందిన ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని,వాళ్లకు ఆర్డర్లు ఇచ్చే అగ్రకుల అధికారులపై మాత్రం ఏ చర్యలు ఉండవని వెనుకబడిన వర్గాల అధికారులకు అంగబలం,అర్ధబలం, రాజకీయ అండదండలు ఉండవు అనే ఉద్దేశంతో వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకున్న ప్రశ్నించే నాధుడు ఉండడనే దైర్యంతో బడుగు,బలహీన వర్గాల ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, ఖమ్మం ఆర్డీవో బదిలీ అంశంలో కూడా అదే జరిగిందని,త్వరలో బీసీ,ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ ఉద్యోగులకు మద్దతుగా ఐక్య కార్య చేపడతామని ప్రకటనలు వెలువడుతుండడంతో ఆర్డీవో బదిలీ అంశం ఏ మలుపు తిరుగుతుందోననని ఉద్యోగులు,రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment