రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జీగా జ్యోత్స్నలాల్ సింగ్ నియామకం!!

Pathi Sreenivas Rao
1 Min Read
రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జిగా నియమించబడిన జ్యోత్స్న లాల్ సింగ్....

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా (ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)జోనల్ ఇంచార్జిగా రఘునాథపాలెం మండలం,ఈర్లపూడి గ్రామానికి చెందిన జ్యోత్స్న లాల్ సింగ్ నాయక్ నియామకం జరిగింది,ఈ మేరకు
ఏఐసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్ పర్సన్ డా.సునీల్ పన్వార్ ఓ ప్రకటన విడుదల చేసారు….

ఈ సందర్భంగా జ్యోత్స్న లాల్ సింగ్ నాయక్ గాంధీ భవన్మాలో మీడియాతో మాట్లాడుతూతనపై అపారమైన నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధిష్టానానికి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు,తనకు ఇచ్చిన బాధ్యతలను చిత్త శుద్ధితో నిర్వహించి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి,కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజికవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని జ్యోత్స్న నాయక్ పేర్కొన్నారు…..

అదే విధంగ తనపై నమ్మకంతో రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ ఉమ్మడి ఖమ్మం ఇంచార్జీగా నియమించిన రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ చైర్ పర్సన్ డాక్టర్. సునీల్ పన్వార్,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శుభాష్ యాకర,మరియు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ సిద్దేశ్వర్ లకు ప్రత్యేక ధాన్యవాదాలు తెలియజేశారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment