పువ్వాడ అజయ్ కుమార్ అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు!!

Pathi Sreenivas Rao
1 Min Read
.

ఖమ్మం నగరం,19 వ డివిజన్లో BRS ప్రభుత్వం హయాంలో నిర్మించిన అభివృద్ధి శంకుస్థాపన శిలాఫలకాలను గత రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,అక్రమ కూల్చివేతలపై స్థానిక BRS నాయకులు,23 వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మగ్బుల్,18,19 డివిజన్ల ఇంచార్జీలు బండారు శ్రీనివాసరావు, చిట్టెంశెట్టి పరమేశ్వరరావు,BRS పార్టీ ఇంచార్జీ స్థానిక కార్యకర్తలతో కలిసి వన్ టౌన్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు,అక్రమ కూల్చివేతలకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు….
అంతే కాకుండా మున్సిపల్ కమీషనర్ ను కలిసి శిలాఫలకాల కూల్చివేతలపై పిర్యాదు చేసి వీలైనంత త్వరగా కూల్చబడిన శిలాఫలకాలను పునర్నిర్మించాలని కోరారు…..

ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ నాడు ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ నగరంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు కనపడకుండా చేసే కుట్రలో భాగంగానే కొంతమంది వ్యక్తులు అక్రమ కూల్చివేతలకు పాల్పడ్డారని ఆరోపించారు,
చేతనైతే అభివృద్ధి చేసి చూపించాలి తప్ప ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడి అభివృద్ధిని చేరిపోయాలని చూడడం హేయమైన చర్య అని,శిలాఫలకాలను కూల్చి వేసినంత మాత్రాన ఖమ్మం నగరంలో పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అభివృద్ధినీ ప్రజల గుండెల్లో నుండి తుడిచి వేయలేరని అన్నారు….

ఇకనైనా ఇలాంటి దుర్మార్గపు చర్యలకు స్వస్థి చెప్పి ప్రజా అభివృద్ధి కోసం పాటుపడాలని హితవు పలికారు,ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే BRS పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని తగిన గుణపాఠం చెప్పి తీరుతారని హెచ్చరించారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment