జనం ముచ్చట, ఖమ్మం జిల్లా:
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 48 వ డివిజన్ కార్పొరేటర్ తోట తోట గోవిందమ్మ, రామారావు ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర నగర్ గణేష్ నగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,BRS పార్టీ అధినేత KCR జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు,కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి 72 కేజీల కేక్ కట్ చేశారు,ఈ సందర్భంగా యువకులు బాణాసంచా కాల్చుతూ,డప్పు,కోలాటాలతో మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి….

స్థానిక 48 వ డివిజన్లో కేసిఆర్ జన్మదిన వేడుకలు…..
ఈ సందర్భంగా తోట దంపతులు రామారావు,గోవిందమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 యేండ్ల ఆకాంక్షను చావు నోట్లో పెట్టి కేంద్రం మెడలు వంచి భారత చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను తెచ్చిన ఘనత బాపు KCR దే అని అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ రాష్ట్ర నాలుగున్నర కోట్ల ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉన్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు, అదేవిధంగా తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, వారి జీవన ప్రయాణం సాగాలని పేర్కొన్నారు….

స్థానికులతో కలిసి మిఠాయిలు పంచుకున్న తోట గోవిందమ్మ, రామారావు దంపతులు…..
ఈ కార్యక్రమంలో వేలాదిగా డివిజన్ ప్రజలు యువత
BRS నాయకులు తోట రమేష్,చేతి కృష్ణ,బాబా,కిషన్ నాయక్ మోటే కుమార్, వీరేందర్, రవీందర్ మహేష్, మధు, ఆకుల సత్యం, నిమ్మల నవీన్ తోకల ప్రభాకర్, శాసనాల మహేష్, శివ,తదితరులు పాల్గొన్నారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:98703973456
