ఖమ్మం జిల్లా మంత్రులకు గౌడ కులస్తులు ఋణపడి ఉంటారు: మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ!!

Pathi Sreenivas Rao
2 Min Read
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ...

ఖమ్మం జిల్లా గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసిన సందర్భంగా తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం వద్ద తెలంగాణ ప్రభుత్వం గతంలో 29 గుంటల భూమిని గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు,అంతే కాకుండా గౌడ్ అన్నల ఆత్మ గౌరవం నిలబడేలా భవనం నిర్మించడం కోసం ఐదు కోట్ల నిధులు ఇచ్చి అభయమిచ్చారనీ,రాష్ట్రంలో నెలకున్న ఆర్థిక పరిస్థితులల్లో నిధులు కేటాయించారంటే మన గౌడ కులస్తులపై ప్రభుత్వానికి,మంత్రులకు ఉన్న చిత్త శుద్ధినీ,నిబద్ధతను తెలియజేస్తుందని అన్నారు….

సీఎం రేవంత్ రెడ్డి ,తుమ్మల,భట్టి,పొంగులేటి,పొన్నం,మహేష్ కుమారు గౌడ్ సహకారం వల్లనే ఇది సాధ్యం అయిందనీ వారికి తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని,రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యక్తిగతంగా 80 లక్షలు ఇస్తామన్నారనీ,త్వరలోనే భవన నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయనీ మాజీ ఎమ్మెల్సీ బాలసాని తెలియజేశారు,ప్రభుత్వం గౌడ సంఘం భవన్ నిర్మాణానికి 5 కోట్ల నిధులు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రవాణా మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్,టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రెవిన్యూ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు….

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, GOPA ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొల్లకొండ శ్రీనివాస రావు గౌడ్, కార్పొరేటర్ వడ్డె బోయిన నర్సింహా రావు గౌడ్,గూడిద శ్రీనివాస గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరగాని వెంకన్న గౌడ్, తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, కార్పొరేటర్ రుద్గాని ఉపేందర్ గౌడ్, మార్కం లింగయ్య గౌడ్, డాక్టర్ నారగాని రామ్ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment