ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మరంగా కొనసాగుతున్న పోలింగ్ !!

Pathi Sreenivas Rao
1 Min Read

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళి గమనిస్తే కడపటి వార్తలు అందేసరికి
దాదాపు 17.2 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది, ఇదే ఒరవడి కొనసాగితే బారీగా పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు….

ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయం పోలింగ్ కొంత మందకొడిగా సాగినప్పటికీ తొమ్మిది,పది గంటల సమయానికి పూర్తి స్థాయిలో ఊపందుకుంది, జలగం నగర్, వరంగల్ క్రాస్ రోడ్డు,ఏదులాపురం, బారుగుడెం,గుదిమల్ల, వెంకటగిరి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు…..

సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ముందస్తుగా బారి బందోబస్తు ఏర్పాటు చేశారు, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు తావు లేకుండా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు, ఖమ్మం DCP రామోజీ రమేష్,రూరల్ ఎసిపి తిరుపతి రెడ్డి,రూరల్ సిఐ యం.రాజు, కారేపల్లి సిఐ సాగర్, టాస్క్ఫోర్స్ సిఐ తిరుపతి రెడ్డి తదితర పోలీసుల అధికారులు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు…

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment