ఖమ్మం జిల్లా:ఏదులాపురం మున్సిపాలిటీ!
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి,BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులతో కలిసి 4,5,6,7,14 వార్డులతో పాటు బారుగూడెం,శ్రీ సిటీ, జలగం నగర్,పెద్ద తండా ,నాయుడుపేటల్లో BRS పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు….

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్…..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సిటీలో ప్లాట్లు, ఇళ్లు ఎవరికీ ఊరికే రాలేదు మీ చెమట చుక్కలతో, మీ కష్టార్జితంతో కొనుక్కున్నవి,ఎవరికీ భయపడవద్దు, మీ వెనుక నేను, మన పార్టీ ఉంది అంటూ ఓటర్లకు హామీ ఇచ్చారు అంతే కాకుండా,ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందనీ,బెదిరింపులకు కాలం చెల్లిందనీ,గడప గడపకు అండగా ఉండే నాయకత్వం నాదని,మాట ఇస్తే ప్రాణం పోయినా వెనకడుగు వేసే వ్యక్తిని కాదని, మీకు ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ దూరంలో నేనుంటానని,ఓటు అనేది మీ ఆయుధం,ఎవరికి వేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకుందనీ ఆ స్వేచ్ఛను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని కందాల పేర్కొన్నారు,…..

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం….
అదే విధంగా మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం మేము చేస్తున్నామని చెప్పుకుంటున్న సోకాల్డ్ నాయకులు దీనికి సంబంధించి జీవో (GO) మీరు తెచ్చారో లేక నేను తెచ్చానో దమ్ముంటే బయట పెట్టండంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కందాల సవాల్ విసిరారు, నాటి కేసిఆర్ ప్రభుత్వంలో మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ (కాంక్రీటు గోడ) నిర్మాణానికి నిరంతరం కృషి చేసింది నేనని,కానీ ఈ రోజు కొంత మంది నాయకులు వాళ్లే శాంక్షన్ చేయించినట్లు ప్రజల ముందు జబ్బలు చరుచు కుంటున్నారని కందాల ఎద్దేవా చేశారు, అంతే కాకుండా మున్నేరుపై ఇప్పుడు నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ BRS ప్రభుత్వంలోమంజూరు అయిందని తెలిపారు,మాట ఇస్తే తప్పే మనిషిని కాదనీ,ఎంత మంది విద్యార్థులను చదివిస్తున్నానో,ఎన్ని దేవాలయాలకు,చర్చిలకు, మసీదుల నిర్మాణానికి నా వంతు సహాయం చేశానో ప్రజలను అడిగితే చెబుతారని కందాల ఒకింత భావోద్వేగానికి గురయ్యారు….

ఎన్నికల ప్రచార సభకు పెద్ద ఎత్తున హాజరైన BRS,CPM కార్యకర్తలు….
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోనీ అన్ని వార్డుల్లో గత BRS ప్రభుత్వం హయాంలో నేను వేసిన సీసీ రోడ్లు,నేను కట్టించిన సైడ్ డ్రెయిన్లు,నేను కల్పించిన మౌళిక సదుపాయాలు తప్ప కొత్తగా గెలిచిన వారు చేసింది ఏమిటని కందాల ప్రశ్నించారు, ఈ ఎన్నికల్లో BRS అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలి,నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై కోట్లాడే నాయకులు కావాలో అపుడపుడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళే నాయకులు కావాలో ఓటర్లు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు…..
పత్తి శ్రీనివాస్:9703973456
