కొత్త‌గూడెం నా సొంత గ‌డ్డ‌- కాంగ్రెస్ అడ్డా: మంత్రి పొంగులేటి!!

Pathi Sreenivas Rao
2 Min Read
కొత్తగూడెం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...

కొత్త‌గూడెం మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం కొత్త‌గూడెం కార్పొరేష‌న్ ప‌రిధిలో మంత్రిగారు విస్తృత ప్రచారం నిర్వ‌హించారు,ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ సింగ‌రేణి ప్రాంతంలో ఇండ్ల స్ధ‌లాల‌కు సంబంధించి జివో 76ను ప‌రిష్కరించి ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు,ఇప్ప‌టికే ఈ ఇండ్ల స్ధ‌లాల స‌మ‌స్య‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి,భూపాల‌ప‌ల్లి స‌భ‌లో స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చార‌ని, కార్మిక ప‌క్ష‌పాతిగా నిలిచిన త‌మ ప్ర‌భుత్వం వారికి న్యాయం చేస్తుంద‌న్నారు,ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రి, ముఖ్య‌మంత్రి వ‌ర‌కు అంద‌రూ కాంగ్రెస్ ప్ర‌తినిధులేన‌ని,ఈ నెల 11 న జరగబోయే మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్దుల‌ను గెలిపించి ప్రజలు అభివృద్ది ఫ‌లాల‌ను అందుకోవాల‌న్నారు…..

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి కొన్ని ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు, క‌త్తి ఎవ‌రికో ఇచ్చి న‌న్ను యుధ్దం చేయ‌మంటే ఎలా?.. కత్తి నాచేతికి ఇచ్చి యుద్ధం చేయ‌మంటే చేస్తా.. అలాగే ఈ ప్రాంత అభివృద్ది కోసం కాంగ్రెస్, మిత్ర‌ప‌క్ష అభ్య‌ర్దుల‌ను గెలిపించండి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని,కొత్త‌గూడెం ప‌రిధిలోని 60 డివిజ‌న్ల‌లో 58 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల సిపిఎం అభ్య‌ర్ధులు పోటీ చేస్తున్నార‌ని వీరంద‌రినీ గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు,అంతే కాకుండా కొత్త‌గూడెం ప్రాంతంలోని రోడ్లు, డ్రైనేజీ, వంతెన‌ల నిర్మాణం, ఎంతో కాలంగా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్న మంచి నీటి స‌మ‌స్య తీరి 24 గంట‌లూ మంచినీటి స‌ర‌ఫ‌రా కావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల‌ను గెలిపించాల‌ని కోరారు,ఇవేగాక యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌నా కార్య‌క్రమాలు, ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మెరుగైన వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించే బాథ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు, ఎల్లుండి పోలింగ్ జ‌రుగునున్నందున ఈ రెండు రోజులు కార్య‌కర్త‌లు మ‌రింత క‌ష్ట‌ప‌డాల‌ని, ఇంటింటికి తిరిగి ప్ర‌చారం చేయాల‌ని సూచించారు……

అదే విధంగా కొత్త‌గూడెం నా సొంత గ‌డ్డ‌- కాంగ్రెస్ అడ్డా అని చెబుతూ రంగుల రంగుల కండువాలు క‌ప్పుకొని శీన‌న్న మాకు తెలుసు అంటూ వ‌చ్చే వారిని న‌మ్మ‌వ‌ద్ద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు, ఏప్రిల్ నుంచి మ‌రో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరు చేస్తామ‌ని, అర్హులైన పేద‌ల‌కు ఇంటిస్ధ‌లంతో పాటు ఇల్లు మంజూరు చేస్తామ‌ని తెలిపారు,

📄 Generate e-Paper Clip
Share This Article