ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం:
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జిల్లా BRS అధ్యక్షుడు తాతా మధుతో కలసి స్థానిక 31 వ వార్డులో సిపిఎం పార్టీ బలపరిచిన BRS పార్టీ అభ్యర్థి ఊరడి హైమావతి విజయాన్ని కాంక్షిస్తూ గడగడపకు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు….

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తాత మధుసూదన్….
ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగులో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు,నేను ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం పాలేరు నియోజకవర్గాన్ని,ముఖ్యంగా ప్రస్తుతం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోనీ అన్ని గ్రామాలను కులాలకు,మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా గతంలో ఎవరు చేయనంతగా నాకు సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేశానని తెలిపారు….

ఎన్నికల ప్రచార సభకు బారీగా హాజరైన BRS,CPM పార్టీ కార్యకర్తలు….
ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అన్యాదోరణులు పెచ్చు మీరుతున్నాయని,అరాచకం రాజ్యమేలుతుందని అన్నారు,
గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చిన పార్టీలతో సంబంధం లేకుండా మన ప్రజలు,నా జనం అనుకోని పనిచేశాను కానీ ఇప్పుడున్న నాయకులు ఏ చిన్న పని కావాలనీ అడిగినా ‘నువ్వు ఏ పార్టీ? నీకు పని చేస్తే పార్టీ మారుతావా లేదా? అంటున్నారని రాజకీయాల్లో ఇలాంటి పెడ ధోరణులు మంచివి కావని, ఇలాంటీ ఆలోచనలు చేసే వాళ్ళు ఎక్కువ కాలం రాజకీయాల్లో మనుగడ సాగించలేరని అన్నారు,ఈ ఎన్నికల్లో BRS పార్టీకి అండగా నిలబడండి,నేను మీ కోసం జనం కోసం జనంలో ఉంటా, జనం కోసం పనిచేస్తానని అన్నారు….
పత్తి శ్రీనివాస్:9703973456
