సీఎం.రేవంత్ రెడ్డి,మంత్రి పొంగులేటి భూబకాసురులు: సిపిఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు!!

Pathi Sreenivas Rao
3 Min Read
ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న సిపిఐ నారాయణ....

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సిపిఐ జాతీయ నాయకుడు కంకణాల నారాయణ వివిధ వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యకర్తలు బారి ర్యాలీ నిర్వహించారు,మహిళలు ఎర్ర చీరలు ధరించి ఎర్ర జెండాలు చేతబూని,డప్పు వాయిద్యాలతో, కోలాటాలతో ఏదులాపురం వీధుల్లో కథం తొక్కారు,వీధులన్నీ “ఎరుపు వర్ణాన్ని” సంతరించుకున్నాయి,ర్యాలీకి అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన లభించిందని,ఈ ర్యాలీ విజయవంతం కావడం రేపటి గెలుపును సూచిస్తుందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు….

ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ నారాయణ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేడు తల్లి పాలుతాగి తల్లి రొమ్ము గుద్దిన చందంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తుందని మండి పడ్డారు,కొత్తగుడెం,ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ పొత్తును కాంగ్రెస్ పార్టీ ఎందుకు తిరస్కరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? కొత్తగూడెం,ఎదులాపురం మున్సిపాలిటీల్లో సీపీఐ పార్టీ గెలుపొందితే సీఎం రేవంత్ రెడ్ది పదవి ఏమైనా ఊడిపోతుందా లేక పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రి పదవి ఏమైనా పోతుందా? కమ్యూనిస్టు పార్టీలు గెలిచేనంత మాత్రానా మీ పదవులకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదుగా ?ఎందుకు రాజకీయ కక్కుర్తి ?అన్నీ మాకే కావాలనే రాజకీయ దురుద్దేశం,కక్కుర్తితో మంత్రి పొంగులేటి ప్రవర్తిస్తున్నాడు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు…

అదే విధంగా మంత్రి పొంగులేటికి ఒకటి చాలెంజ్ చేస్తున్న నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఎదులాపురంలో గానీ కొత్తగూడెంలో గానీ పేద వాళ్ళకు ఒక్క సెంటు భూమి గానీ,ఒక్క ఇల్లు గానీ ఇచ్చిన జాడ ఉందా అంటూ ప్రశ్నించారు,ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ భూపోరాటాలు చేసి వందల ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర ఉంది,మీకు ఏచరిత్ర ఉంది అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు,కమ్యూనిస్టులు భూమి పుత్రులు మీరు భూ బకాసురులు మీరు ప్రభుత్వ భూములన్నీ కొల్లగొడుతున్నారు,మేము భూములు పేదలకు పంచుతున్నాం, ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు భూ బకాసురులకు, పేదలకు జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు, సీఎం రేవంత్ రెడ్ది BRS వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండని చెప్పినట్లు నేను డబ్బులు తీసుకుని ఓట్లు వేయమని చెప్పడం లేదు, ప్రజలు స్వచ్ఛందంగా ప్రజా సమస్యల మీద కోట్లాడే భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అడుగుతున్నామని తెలిపారు…..

అంతే కాకుండా అవినీతిలో, పేదల భూములు బలవంతంగా గుంజుకోవడంలో కాంగ్రెస్ BRS పార్టీ దొందు దొందే, నిండు అసెంబ్లీలో రెండు పార్టీలు బూతులు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏముందంటూ నిలదీశారు,ప్రజల ముందు గుద్దులాట, రాత్రయ్యాక ముద్దులాట అన్నట్లు వీరిద్దరి చీకటి రాజకీయ ఒప్పందాలు చేసుకుంటున్నారని,కానీ సిపిఐ సిద్ధాంతం అదికాదని ఎవరు తప్పు చేసిన ప్రజల ముందు నిలబెట్టి ప్రశ్నిస్తామని,అసెంబ్లీలో కాకుల్లో కోకిల లాగా కూనంనేని సాంబశివరావు ఒక్కడే సీపీఐ ఎమ్మెల్యేగా స్థానిక ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కొట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు,ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఓడించి సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసారు….

📄 Generate e-Paper Clip
Share This Article