ఖమ్మం సిటీ :1:2:2026
తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరం లోని ఇల్లందు క్రాస్ వద్ద
BRS పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది,
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి బి.ఆర్.యస్ కార్యకర్తలు ప్రయత్నించిన క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం తోపులాట జరిగింది ఈ తోపులాటలో ఖమ్మం వన్ టౌన్ సిఐ
తాటిపాముల కరుణాకర్ ఎడమ చేయి విరిగింది, దీంతో
బందోబస్తు విధుల్లో ఉన్న ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ విధులకు ఆటంకం కలిగించి,గాయపరిచిన పలువురుపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు…..

ఖమ్మం ఇల్లెందు క్రాస్ రోడ్డులో ధర్నా చేస్తున్న మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్….
బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అభ్యర్థన మేరకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ర్యాలీ లో 100 మందికి మించకూడదని, దిష్టి బొమ్మల దగ్దం చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం, రోడ్ పై ధర్నాలు చేయడం వంటి చర్యలు చేయకూడదనే షరతులతో ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయం నుండి అనుమతి ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 11.20 గంటల సమయంలో పరిమితికి మించి 200 లకు పైగా బైక్ లతో ర్యాలీ నిర్వహిస్తూ దాదాపు 300 మందితో ఇల్లందు క్రాస్ రోడ్ పై అడ్డంగా బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే చర్యను నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పెట్రోల్ చల్లుతూ… భయభ్రాంతులకు గురిచేస్తూ ఉద్దేశపూర్వకంగా ఇన్స్పెక్టర్ కరుణాకర్ విధులకు ఆటంకం కలిగించి, గాయపరిచడంతో అతని చేయి విరిగిందని,స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందించామని ఏసీపీ పేర్కొన్నారు….

అరెస్ట్ అనంతరం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజును పరామర్శించిన మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్….
బందోబస్త్ విధులు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్ ఎస్సై ఉఫాతుల్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పగడాల నాగరాజు, అతని అనుచరులు పొయిల పొంగు ఉపేందర్, పొయిలపొంగు వెంకట్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు,నామవరపు ఈశ్వర్, మాటేటి కిరణ్, భుక్య అశోక్ మరి కొంతమంది పై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు…..
Pathi Srinivasa Rao:9703973456
