ఖమ్మం పిఎన్నార్ డూప్లెక్స్ విల్లాలకు వక్ఫ్ బోర్డు నోటీసులు!!

Pathi Sreenivas Rao
1 Min Read
PNR DUPLEX VILLA PROJECT Telangana Waqf Board Notices...

ఖమ్మం నగరంలో స్థానిక గొల్లగూడెంలో ఉన్నత శ్రేణి వర్గాలు నివసించే ప్రతిష్టాత్మక గేటెడ్ కమ్యూనిటీ అయిన “PNR DUPLEX VILLAS’S PROJECT” గత కొంత కాలంగా వివాదాల కొలిమిలో నిత్యం రగులుతూనే ఉంది,తాజాగా తెలంగాణ వక్ఫ్ బోర్డు సదరు విల్లా యజమానులకు గత నెల 12 న నోటీసులు జారి చేసిన విషయం ఆలస్యం వెలుగులోకి వచ్చింది…

వివారాల్లోకి వెళితే అర్బన్ మండలం వెలుగుమట్ల రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 425,లో 17-24 కుంటలు,సర్వే నెంబర్ 432 లో 12-35 కుంటల భూమిలో కొంత భాగం దురాక్రమణకు గురైందని,ఆక్రమణకు గురైన భూమిలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి పెద్ద పెద్ద విల్లాలు నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారని తెలంగాణ వక్ఫ్ బోర్డుకు పిర్యాదులు అందడంతో వక్ఫ్ చట్టం 1995 U/sec 54(1)ప్రకారం విల్లా యజమానులకు నోటీసులు జారీ చేసింది, నోటీసులు అందిన పదిహేను రోజుల లోపు సమాధానం ఇవ్వాలని లేదా వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించి నిర్మించిన గృహలను ఎందుకు తొలగించ కూడదు అంటూ నోటీసుల్లో వక్ఫ్ బోర్డు పేర్కొంది….

ఈ వివాదంలో వక్ఫ్ బోర్డు వాదన ఇలా ఉంటే విల్లాల యజమానుల వాదన వేరే విధంగా ఉంది,అసలు విల్లాలు నిర్మించిన సర్వే నెంబర్లకు వక్ఫ్ బోర్డు సూచిస్తున్న సర్వే నెంబర్లకు సంబంధం లేదని,గతంలో అనేకమార్లు అధికారులు “క్లీన్ షీట్” ఇచ్చారని కావాలనే కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ తమ ఆధిపత్యం కోసం లేని పోనీ వివాదాలు సృష్టిస్తున్నారని, వెరెవరికో లీజు పేరుతో వక్ఫ్ బోర్డు భూములను లీజు పేరుతో దారాదాత్తం చేస్తున్నారనే అనుమానంతో దాన్ని అడ్డుకోవడం కోసం కొంతమంది కావాలనే “PNR DUPLEX VILLA’S PROJECT” వివాధాల్లోకి లాగి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, ఈ అంశం చట్ట పరిధిలోనే తేల్చుకుంటామని తెలిపారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment