BRS పార్టీ ధర్నాలో ఉద్రిక్తత, వన్ టౌన్ సిఐకి గాయాలు!!

Pathi Sreenivas Rao
1 Min Read
One Town CI Karunakar injured in BRS party dharna...

తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరం లోని ఇల్లందు క్రాస్ వద్ద రోడ్డుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బైటయించారు,ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి బి.ఆర్.యస్ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి దీంతో పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం తోపులాట జరిగింది…..

ఆ క్రమంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఒకసారిగా దిష్టిబొమ్మపై పెట్రోల్ పోయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి,దీంతో కిందపడ్డ వన్ టౌన్ సీఐ కరుణాకర్ తో పాటు టూ టౌన్ సిఐ బాలకృష్ణకు మంటలు అంటుకోవడంతో కరుణాకర్ కు మేజర్ గాయాలు అయ్యాయి,హుటాహుటీనా ఒక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించగా
చేతి మణికట్టు విరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు…..

గతంలో కూడా వన్ టౌన్ సి ఐ కరుణాకర్ ను టార్గెట్ చేసి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో నేటి బి ఆర్ ఎస్ నిరసన కార్యక్రమంలో ఉద్దేశ్య పూర్వకంగానే వన్ టౌన్ సిఐ పై దాడి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు,కేవలం నిరసన ర్యాలీ కి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ధర్నా చేయడం,సి ఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు పెట్రోల్ పోసి నిప్పంటించనందుకు,పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు బి.ఆర్.ఎస్ నేతలపై పలు సెక్షన్ ల క్రింద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment