హైదరాబాద్ :Feb:1:2026
పోన్ ట్యాపింగ్ కేసులో BRS పార్టీ అధినేత కేసిఆర్ సిట్ జారీ చేసిన నోటీసులపై జూబ్లీహిల్స్ ఎసిపికి కేసీఆర్ ఘాటైన లేఖ వ్రాసారు,నోటీసులు జారీ విషయంలో సిట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కిందని,సిట్ జారీ చేసిన నోటీసులు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని,ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కేసిఆర్ మండిపడ్డారు….
రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమ పద్ధతిలో నోటీసులు ఇచ్చి సెక్షన్ 160 కింద సాక్షిగా విచారణ చేసేందుకు సిట్ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది, అధికారులు పరిధి దాటి,చట్టాలను ఉల్లంఘించి చివరకు కోర్టు తీర్పులను కూడా పోలీసులు కాలరాస్తున్నారని లేఖలో కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు,తెలంగాణ సాధకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తనకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన గౌరవాన్ని పోలీసులు విస్మరించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు….
చట్ట పరిధిలోని అంశాలను త్రోసిరాజని రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే నోటీసులకు తాను హాజరు కావాల్సిన అవసరం లేదని,తనకు నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకు లేదని, అక్రమ పద్ధతిలో చట్టాలను అతిక్రమించి తనకు నోటీసులు జారీ చేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కులను కాలరాయడమేనని, నోటీసులు ఇవ్వడంలో సిట్ అధికారులు పాటిస్తున్న ద్వంద ప్రమాణాలను,పోలీసుల విపరీత ధోరణి
కేసిఆర్ తన లేఖలో ఎండగట్టారు…..
చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా,ఒక బాధ్యతాయుత్తమైన పౌరుడిగా,మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా చట్టాన్ని గౌరవిస్తానని,సిట్ దర్యాప్తుకు సంపూర్ణంగా సహకరిస్తానని, ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు నంది నగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని సిట్ అధికారులకు వ్రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు,ఈ నేపథ్యంలో BRS కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ నివాసానికి చేరుకునే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు….
Pathi Srinivasa Rao:9703973456
