హైదరాబాద్ :Jan:31:1:2026
సమ్మక్క,సారలమ్మ జాతర ముగింపుపై రాష్ట్ర రెవిన్యూ
శాఖా మంత్రి పంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు,తెలంగాణ ప్రజా ప్రభుత్వం గొప్ప సంకల్పంతో జాతరను ఎంతో వైభవంగా నిర్వహించాలన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, సహచర మంత్రుల సాకారంతో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం తో పనిచేసి ప్రశాంతంగా జాతర ముగిసేలా కృషిచేసి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో
మహా జాతర ముగిసిందని తన ప్రకటనలో తెలియజేసారు….

వన ప్రవేశం చేస్తున్న సమ్మక్క, సారాలమ్మలకు వీడ్కోలు పలుకుతున్న అశేష భక్తజనం….
ఈ ప్రకటనలో నాలుగు రోజులు మేడారం మెరిసింది..
సంబురం అంబరాన్ని తాకింది..
శాశ్వత నిర్మాణాలతో కొత్త చరిత్రను లిఖించింది..
అమ్మల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం సంకల్పం నెరవేరింది.
వనం నుంచి గద్దెలపైకి విచ్చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వనప్రవేశం చేసిన క్షణం భక్తి, భావోద్వేగాల సంగమంగా నిలిచింది. భక్తుల హృదయాల్లో అపార విశ్వాసాన్ని నింపిందని,నాలుగు రోజుల నుండి అశేష భక్త జనం జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి, వన దేవతలకు బంగారం (బెల్లం), మొక్కులు సమర్పించారని పేర్కొన్నారు…..

వనంలోకి తరులుతున్న సమ్మక్క,సారలమ్మ తల్లులు….
గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన కట్టడాలు, ఆచారాలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తాయి. నాలుగు రోజుల ఉత్సవం మన సంప్రదాయాల గొప్పతనాన్ని, ఐక్యత శక్తిని మరోసారి గుర్తుచేసింది,శ్రీ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆశభావం వ్యక్తం చేశారు….
Pathi Srinivasa Rao:9703973456
