భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:Jan 12:1:2026
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైన శ్రీమతి తోట దేవి ప్రసన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహా యం రఘురాం రెడ్డి,శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు,జారే ఆదినారాయణ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర,జిల్లా మండల స్థాయి నేతలు, కార్యకర్తలతో కలిసి మంత్రి పొంగులేటి పాల్గొన్నారు,ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు…..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తోట దేవి ప్రసన్న…..
తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో కీలకపాత్ర పోషించాలి,ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానాలను బంగారం పళ్ళెంలో పెట్టి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలుగా, అభిమానులుగా, కుటుంబ సభ్యులుగా, మనందరి పైన బాధ్యత ఉందనీ,ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నాం ,మాలో ఎవరికీ ఎలాంటి భేషజాలు లేవు,ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసి మాపై కుట్రలు పన్నినా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మవద్దు,కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు….

సభలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి….
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద మహావటవృక్షం,ఆ వృక్షం పచ్చగా ఉంటేనే మనమందరం చల్లగా ఉంటాం. ఆ చెట్టుకొమ్మలు,మొదలను నరుక్కుంటే ప్రమాదంలో పడేది మనమే,ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది,ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ,కన్నీళ్లు పెట్టుకుంటూ, జెండాను మోస్తూ పోరాటం చేసిన కార్యకర్తలకు అన్నివేళలా మీ ఇంటి పెద్ద కొడుకుగా,ఒక తమ్ముడిగా,ఒక అన్నలా అండగా ఉంటాను,ఎన్నికలు,అధికారం,పదవులు వస్తుంటాయి పోతుంటాయి,ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఉన్నదానికంటే మరింత బలోపేతం చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట అనేలాగా చేయడంలో అందరం కృషి చేయాలి,స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా దీవెనలతో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలు సాధించింది,గ్రామ పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో త్వరలో జరిగే కార్పొరేషన్,మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్ మీద మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఎగరవేయడమే మన లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు…..

డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తున్న తోట దేవి ప్రసన్న….
Pathi srinivasa Rao: 9703973456
