సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక!!

Pathi Sreenivas Rao
2 Min Read
The ministers inspected the arrangements for the Sammakka Saralamma festival and the ongoing development works.

ఈ రోజు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,దనసరి సీతక్క,కొండా సురేఖ,అడ్లూరి లక్ష్మణ్, యంపి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని, జాతర ఏర్పాట్లను పరిశీలించారు,ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు,గోవిందరాజుల గద్దెలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం మేడారంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం మంత్రులు పాల్గొన్నారు…..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కోట్లాది భక్తుల కొంగుబంగారమై,గిరిజనుల గుండెల్లో కొలువైన సంబురమై,ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకై,విరాజిల్లుతున్న శ్రీ సమ్మక్క,సారలమ్మ మేడారం జాతరకు రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం
చేపట్టిందని అన్నారు,ప్రపంచంలో పేరుగాంచిన అతిపెద్ద గిరిజన మహా జాతరను ప్రపంచ యవనికపై సగర్వంగా నిలపాలనే సంకల్పంతో,జాతర విశిష్టతను, ప్రాచుర్యాన్ని చాటి చెప్పాలనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మేడారంలో జాతర నిర్వహణ కోసం రూ. 150 కోట్లు,శాశ్వత నిర్మాణ పనులకురూ.101 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందనీ తెలిపారు…..

గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనీవినీ ఎరుగని రీతిలో జాతర నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయనీ,ఇప్పటికే జాతర పనులు 85శాతం పూర్తి అయ్యాయి,మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు,కుంభమేళాను ఉదాహరణగా తీసుకుని అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలను మేడారంలోనూ అనుసరించాలని అధికారులకు ఆదేశించారు, ఆరోగ్యం, విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు,ముఖ్యంగా ఈ నెల 18 వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో,అమ్మవార్ల దర్శనం తరువాత ఇక్కడే కేబినెట్‌ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వెల్లడించారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment