మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖమ్మం మున్నేరు కేబుల్ బ్రిడ్జి నుండి వరంగల్ క్రాస్ రోడ్డు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల ఆర్&బి రోడ్డు విస్తరణ మరియు సెంటర్ డివైడర్ నిర్మాణంలో ఆర్&బి అధికారులు, కాంట్రాక్టర్ పనితీరు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది….
అసలు విషయానికి వస్తె దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగే డివైడర్ నిర్మాణం పనుల్లో అనేక లోపాలు ఉన్నాయి,ముఖ్యంగా యూ టర్న్ లు ఏర్పాటులో చేసే విషయంలో అధికారులు, కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీరుపలు అనుమానాలకు తావిస్తోంది,యూ టర్న్ ల ఏర్పాట్లలో ఎక్కడ సాంకేతిక అంశాలను,ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు….

పెద్దతండ సర్కిల్ మూల మలుపు వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్…
ముఖ్యంగా పెద్ద తండా సర్కిల్ వద్ద ఉన్న మూలమలుపులో ఏర్పాటు చేసిన “యూ టర్న్” అత్యంత ప్రమాదకరంగా మారింది,అసలే మూలమలుపు,నాలుగు వైపుల నుండి వేగంగా వచ్చే వాహనాలు, మరో వైపుఆంజనేయ స్వామి దేవాలయం,నలువైపుల నుండి వాహనాలు దూసుకు వస్తుంటేఆ సర్కిల్లో జరగబోయే ప్రమాదాలను ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది,కానీ అధికారులకు,కాంట్రాక్టరుకు ఇవేమీకనపడినట్లు లేదు,తమ ఇష్టానుసారం సున్నితమైన ప్రాంతంలో “యూ టర్న్” ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు,అంతే కాకుండా డివైడర్ నిర్మాణం మొదలైన దగ్గర నుండిచివరి వరకు ఏర్పాటు చేసిన ఆరు “యూటర్న్”లలో వంద నూటేబై మీటర్ల వ్యవధిలోనే నాలుగు “యూటర్న్”లు ఏర్పాటు చేసిన తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది,పెద్ద తండా సర్కిలో ఏర్పాటు చేసిన యూటర్న్ సున్నితమైన ప్రాంతం కాగా దానికి ఇరువై అడుగుల దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ కోసం ఒక యూటర్న్ ఇవ్వడం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది….

పెద్దతండ పెట్రోల్ బంక్ కోసం ఏర్పాటు చేసిన యూటర్న్….
ఈ యూటర్న్ లు ఏర్పాటు చేయడంలో ఇంకో దారుణమైన అంశం ఏమిటంటే పెద్ద తండా సర్కిల్ యూటర్న్ కి కేవలంముప్పై అడుగులు దూరంలో ఉన్న ఒక కాంట్రాక్ట్ ఇంటికి యూటర్న్ ఇవ్వడంతో పాటు దానికి మరో వంద అడుగుల దూరంలో ఉన్న సదరు కాంట్రాక్టర్ కమర్షియల్ కాంప్లెక్స్ కు
పెద్ద పెద్ద యూటర్న్ లు ఇవ్వడంతో అధికారులు,కాంట్రాక్టర్ వ్యవహారశైలిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి….

ఓ కాంట్రాక్టర్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పెద్ద యూటర్న్….
ఒక మంచి సదుద్దేశంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న సెంటర్ డివైడర్,రోడ్డు విస్తరణ పనులకు
అధికారులు,కాంట్రాక్టర్ కలిసి తూట్లు పొడుస్తున్నారని,ఇంత జరుగుతున్న,యూటర్న్ ల నిర్మాణంపై ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే నియోజవర్గ ఎమ్మెల్యే,మంత్రి పొంగులేటిని కలిసి అధికారులు, కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై పిర్యాదు చేస్తామని స్థానికులు చెబుతున్నారు..

కాంట్రాక్టర్ కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్……
