ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రాజకీయ పార్టీల్లో సందడి మొదలయ్యింది, కార్పొరేషన్ పీఠం మాదంటే మదంటూ సవాళ్లు విసురుకుంటున్నారు కానీవాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రతిపక్ష పార్టీకి కొంత మేరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారం,డబ్బు ముందు ఏమాత్రం తట్టుకుని నిలబడగలుగుతుందనేది
ప్రశ్నగా మారింది…..
వాస్తవానికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు,పాత కాంగ్రెస్,కొత్త కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సమన్వయం లేక రెండుగా వర్గాలుగా చీలిపోయారు,మొదటి నుండి ఎన్ని కష్టాలు ఎదురైనా,పది సంవత్సరాలుగా అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా మోసామని కాబట్టిఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని పాత కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పట్టుబడుతుండగా,గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో మాదే కీలక పాత్ర కాబట్టి మాకు ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీలు పడుతున్నారు,ఈ క్రమంలో ఒక్కో డివిజన్లో మూడు వర్గాలు,ఆరు కుంపట్లుగా తయారయ్యారు,ఈ వర్గాల్లో ఏ వర్గానికి టికెట్ దక్కినా మిగతా వర్గాలు ప్రత్యర్థి పార్టీలకు మద్దతు తెలుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు,ముఖ్యంగా వన్ టౌన్,త్రీ టౌన్ ప్రాంతంలో ఈ బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది….,
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు,అరవై డివిజన్లకు ప్రత్యర్థులను ఎదుర్కునే దీటైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ అధిస్థానం వెతుకుతున్న తరుణంలో మధ్యలో పాత,కొత్త గొడవలు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి,కొద్ది రోజుల్లో కొంతమంది బి.ఆర్.యస్ పార్టీ కార్పొరేటర్లు అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వెలువడుతున్న క్రమంలో అధికార పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు,అదే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లలో చాలామంది మీద అవినీతి,సెటిల్మెంట్స్,ఆరోపణలు ఉండడం,సొంత వ్యవహారాలు తప్ప ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల మీద పూర్తి స్థాయిలో ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి స్థానంలో క్లీన్ ఇమేజ్ ఉండి,డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తే ఫలితాలు కొంత ఆశాజనకంగా మరే అవకాశం ఉంది….
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖమ్మం నియోజకవర్గంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ప్రాధాన్యత దక్కలేదనే అభిప్రాయం కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయింది,ఈ విషయం మీదే ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో మైనారిటీలకు ప్రాధాన్యత దక్కడం లేదని,కనీసం స్టేజి మీదకు పిలిచి మాట్లాడించే పరిస్థితి లేదని సభలోనే ఓ మైనారిటీ నాయకుడు మరో నాయకునితో సభలోనే వాగ్వివాదానికి దిగడం అప్పట్లో సంచలనం సృష్టించింది,ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది …..
ఇక బి.ఆర్. యస్ పార్టీ విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత,కొంత మంది వ్యక్తులు చేసిన పనులకు బి.ఆర్.యస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది,ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు,పార్టీ అధికారం కోల్పోవడంతో పార్టీ కేడర్ కొంత నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది,అదే క్రమంలో కొంత మంది కార్పొరేటర్లు పార్టీని వీడి అధికార పార్టీలోకి చేరడం,బి.ఆర్.యస్ పార్టీని కొంత ఆత్మన్యూనత భావంలోకి నెట్టేసింది,అదే సందర్భంలో పార్టీని అన్నీ తానై నడిపించే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి మీద అనేక రూమర్లు రావడంతో,ఒక విధంగా చెప్పాలంటే ఈ పరిణామాలు బి.ఆర్.పార్టీని క్రుంగదీసాయి,ఒక సందర్భంలో ఖమ్మంలో ఆ పార్టీ మనుగడ సాధిస్తుందా అనే సందేహం కార్యకర్తల్లో నెలకుంది కానీ రాను రాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, పువ్వాడ అజయ్ కుమార్ ఆరోగ్యం మీద వచ్చిన రూమర్లు తప్పని,తన ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమి లేదని,రూమర్లు పటాపంచలు అవడంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు,ఈ క్రమంలోనే వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఖమ్మం నియోజకవర్గంలో బి.ఆర్.యస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి, నియోజకవర్గంలో ఏకైక మండలం అయిన రఘునాథపాలెం
మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయితీల్లో దాదాపు పదమూడు గ్రామ పంచాయితీలు గెలుపొందడం,మరో ఆరు గ్రామ పంచాయతీలు స్వల్ప మెజారిటీలతో ఓటమి పాలయ్యారు , పువ్వాడ అజయ్ కుమార్ మరో నాలుగు రోజులు ప్రచారం నిర్వహించి ఉంటే ఊహలకు అందని ఫలితాలు వచ్చేవని కార్యకర్తలు భావిస్తున్నారు……
ఇప్పటి వరకు నియోజకవర్గంలో నిస్తేజంగా ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా కొత్త జవసత్వాలు వచ్చాయి,అదే ఊపుతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా సత్తా చూపుతామని,కచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాలో పార్టీ ఉంది కానీ ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లలో కొంత మంది మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండడం,మరికొంత మంది కార్పొరేటర్ల మీద స్థానికంగా వ్యతిరేకత ఉండడం కొంత మైనస్ గా మారే అవకాశం లేకపోలేదు,రాబోయే ఎన్నికల్లో కొంత మంది కార్పొరేటర్లకు ఉద్వాసన పలికి ఆ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు….
ఏది ఏమైనా డబ్బు,అధికార బలం ఒకవైపు,క్యాడర్ బలం, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మరోవైపు, అస్త,శస్త్రాలుగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న పార్టీలకు ప్రజలు విజయం చేకూరుస్తారా ?పార్టీలకు ఏ విధమైన అనుభవం మిగులుస్తారనే విషయం ఎన్నికలు అయ్యేదాక వేచి చూడాల్సిందే……
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, ఖమ్మం:9703973456
