ఖమ్మం సిటీ….
నూతన సంవత్సరం సందర్భంగా నూతనంగా ఏర్పడిన ఖమ్మం జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గం ఆధ్వర్యంలో
స్థానిక బాల సదన్ లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు… పంపిణీ కార్యక్రమం నిర్వహించారు….

బాల సదన్ విద్యార్థినులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న కలెక్టర్…
ఆ తరువాత జరిగిన కార్యక్రమంలో బాలసదన్ విద్యార్థినులు మరియు TRESA కార్యవర్గంతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్ కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకుని,కాసేపు పిల్లలతో ఆత్మీయంగా గడిపారు,పిల్లలను చూస్తుంటే బాల్యం గుర్తుకు వస్తుందని అన్నారు….

పిల్లలకు కేక్ తినిపిస్తున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి…
ఈ సందర్భంగా TRESA కార్యవర్గాన్ని కలెక్టర్ అభినందించారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు పెద్ద ఎత్తున చేయాలని, సమాజంలో అభాగ్యులను అందుకోవడంలో రెవెన్యూ ఉద్యోగులు ముందు వరుసలో ఉండాలని,ప్రతి ఒక్కరికి మేమున్నాం అనే బరోసా కపించాలని,ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ముందుండి నడిపించిన ఖమ్మం జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ కార్యవర్గాన్ని కలెక్టర్ అభినందించారు…..

కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న ఖమ్మం జిల్లా TRESA కార్యదర్శి కే.వి.ప్రసాద్…
ఈ కార్యక్రమంలో TRESA అధ్యక్షుడు తుంబూరు సునీల్ రెడ్డి,కార్యదర్శి కే.వి. ప్రసాద్,కోశాధికారి మేకల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు….
