హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నూతన సంవత్సర సందడి ఉప్పొంగింది. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్‌లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు…..

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసిన మంత్రి పొంగులేటి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు నేతలు ఆత్మీయంగా కరచాలనం చేసుకుని, కొత్త ఏడాదిలో ప్రజా పాలనను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు….
