-ఖమ్మం డిసెంబర్ 31
ఖమ్మం నగరంలోని ప్రముఖ స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు ఘనంగా నిర్వహించారు,పాఠశాల చిన్నారులు కొత్త ఏడాదికి సుస్వాగతం పలుకుతూ,నృత్యాలు చేస్తూ ఘనంగా వేడుకలు జరిపారు…

చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తున్న పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య, డైరెక్టర్ చింతనిప్పు సుకన్య….
తొలుత పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య న్యూ ఇయర్ కేక్ ని కట్ చేసి చిన్నారులకు తినిపించారు. విద్యార్థులు తమ మిత్రులకు మిఠాయిలు పంచుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కేరింతలు కొడుతూ, స్టెప్పులు వేస్తూ సందడి చేశారు…..

నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ నృత్యం చేస్తున్న చిన్నారులు
అనంతరం స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ప్రచురించిన నూతన సంవత్సర క్యాలెండర్ లను పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య ఆవిష్కరించారు. విద్యార్థుల ఫోటోలతో, పాఠశాల కార్యక్రమాలతో కూడిన ఈ క్యాలెండర్ ప్రత్యేకతను సంతరించుకోగా క్యాలెండర్ ను, గ్రీటింగ్ కార్డులను విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ అందజేశారు……

స్మార్ట్ కిడ్జ్ పాఠశాల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య, డైరెక్టర్ చింతనిప్పు సుకన్య మరియు ఉపాధ్యాయులు….
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ శుభాలు అందించాలని ఆకాంక్షించారు. పాఠశాల విద్యార్థులు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరారు. చదువుల్లోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక, వైజ్ఞానిక అంశాల్లోనూ నూతన సంవత్సరంలో ఘనవిజయాలు సాధించి పాఠశాలకి,జిల్లాకి ఖ్యాతిని ఇనుమడింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య ,ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు……
