పాలేరులో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్, సీపీఎంల నుంచి భారీగా చేరికలు!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • పాలేరులో కొనసాగుతున్న కాంగ్రెస్ హవా.. బీఆర్ఎస్, సీపీఎంల నుంచి భారీగా చేరికలు....
  • ఆరేకోడు గ్రామం నుంచి అధికార పార్టీలో చేరిన ముఖ్య నేతలు.....
  • కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొంగులేటి క్యాంపు ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి.....
  • అభివృద్ధి, సంక్షేమ పాలన చూసే కాంగ్రెస్‌లో చేరుతున్నామన్న నేతలు....

పాలేరు :ఖమ్మం రూరల్ మండల పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. తాజాగా బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోట వీరభద్రం ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. సీపీఎం ముఖ్య నేత పేరెల్లి మధు, బీఆర్ఎస్ ముఖ్య నేత ఎనిగండ్ల రాంబాబు తదితరులు భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలిసి అధికార పార్టీ బాట పట్టారు….

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన నేతలకు ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా రంజక పాలన, స్థానికంగా నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే తాము ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చినట్లు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా కృషి చేయాలని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలివేరు బాబు, గునిగంటి రమేష్, ఉప్పుగండ్ల ప్రసాద్, గునిగంటి సురేష్, కుసుమ రాజ, అరేంపుల రామారావు, మహిళా నాయకురాళ్లు గన్నోజు గోవిందమ్మ, అరేంపుల సునీతలతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment