తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ : నగరంలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను బయాందోళనలకు గురిచేస్తున్న ఒక అంతర్రాష్ట్ర కిలాడీ దొంగను ఖమ్మం పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి భారీ ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం టౌన్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో టౌన్ ఏసీపీ రమణమూర్తి, సీసీఎస్ ఏసీపీ సర్వర్ సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు….

రూ. 32 లక్షల విలువైన సొత్తు రికవరీ….
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కంబంపాటి ఏసోబు అలియాస్ కందుల సురేష్ రెడ్డి (45) వృత్తిరీత్యా సెంట్రింగ్ వర్కర్. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఇతడు దొంగగా మారాడు. గత కొన్ని నెలలుగా రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నాడు.మంగళవారం సాయంత్రం ఖమ్మం టూ టౌన్, సిసిఎస్ పోలీసులు ఉమ్మడిగా నగరంలోని కిన్నెర హోటల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు ఏసోబును పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో అతడు చేసిన వరుస దొంగతనాల చిట్టా బయటపడింది. నిందితుడి వద్ద నుండి పోలీసులు రూ. 32 లక్షల విలువైన 32 తులాల బంగారు ఆభరణాలు అలాగే రూ. 40 వేల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు కంబంపాటి ఏసోబు సాధారణ దొంగ కాదని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై పాత నేర చరిత్ర ఉందని ఏసీపీ తెలిపారు. గతంలో ఇతగాడు పలు దొంగతనాలు చేసి, జైలు శిక్షలు కూడా అనుభవించాడు. ఇతనిపై గతంలోనే దాదాపు 22 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి…..

గత ఏడాది కాలంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడు చేసిన దొంగతనాల వివరాలు….

పోలీసుల హెచ్చరిక….
ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, లేదా సిసి కెమెరాల నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచి, నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, మరియు ఎస్సై రమేష్‌లను, ఇతర సిబ్బందిని ఏసీపీలు రమణమూర్తి, సర్వర్ ప్రత్యేకంగా అభినందించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
