తెలంగాణ /ఖమ్మం జిల్లా :
సత్తుపల్లి : ప్రస్తుతం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బుగ్గపాడు “ఫుడ్ పార్క్” భూముల వివాదం హాట్ టాపిక్ గా మారింది, గత కొన్ని రోజులుగా “జనం ముచ్చట”లో ఈ అంశంపై వరుస కథనాలు వెలువడడంతో ప్రతిపక్ష నాయకులు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు…నిన్న అశ్వరావుపేటలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుగ్గపాడు భూములపై తీవ్ర వ్యాఖ్యలుచేసి ఒక్క రోజు గడవ కముందే తాజాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలతో ఒక్కసారిగా
బుగ్గపాడు భూముల అంశం జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్నాయి….మొన్న పాలేరులో మంత్రి పొంగులేటిని టార్గెట్ చేసిన కేటీఆర్ నేడు మంత్రి తుమ్మలను తుమ్మలపై “మట్టి మాఫియా” అంటూ చేసిన విమర్శలు జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించ్చాయి….

అరవై లక్షల విలువ చేసే భూములు ఇరవై లక్షలకే దారదత్తం చేయడానికి ఎవడబ్బ సొమ్ము….

సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి BRS కార్యకర్తలకు, BLA లకు SIR పై జరిగిన జరిగిన అవగాహన సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు,ఈ సందర్బంగా కేటీఆర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు,ముఖ్యంగా బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆయన ధ్వజమెత్తారు.బుగ్గపాడు ఫుడ్ పార్కు ఉన్న ప్రాంతంలో మార్కెట్ విలువ ప్రకారం ఎకరం రూ. 60 లక్షలు పలుకుతుంటే, ఆ భూములను కేవలం రూ. 21 లక్షలకే అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు,…..

వంద కోట్ల మట్టి దోపిడీ వెనుక ఉన్నది ఎవరు?
అదే విధంగా ఎకరం కనీసం రూ. 40 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలని టీఎస్ఐఐసీ (TSIIC) స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా 70 ఎకరాలను ఎకరం రూ. 21 లక్షలకే ఎవరికి రాసిచ్చారు? ఎవరి ప్రయోజనాల కోసం రాసిచ్చారు? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు అంతే కాకుండా బుగ్గపాడు ఫుడ్ పార్కులో కేవలం భూములనే కాకుండా, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మట్టిని కూడా దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. దాదాపు రూ. 100 కోట్ల విలువైన మట్టి దోపిడీ వెనుక ఉన్నది సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు….
రియల్ ఎస్టేట్ దందా కోసమే వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత….
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, పక్కన నిర్మిస్తున్న విల్లాలకు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే వెలుగుమట్లలో పేదలు నిర్మించుకున్న దాదాపు 1000 ఇళ్లను కాంగ్రెస్ నాయకులు నేలమట్టం చేశారని కేటీఆర్ మండిపడ్డారు,రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమో పడిపోతోంది కానీ, ఖమ్మం జిల్లా మంత్రుల అక్రమ సంపాదన మాత్రం వందలు, వేల కోట్లకు పెరిగిపోతోందని ఆయన దుయ్యబట్టారు ఒకవైపు రైతులకు సరైన సమయంలో రైతుబంధు, యూరియా అందక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు మంత్రులు మాత్రం తమ రియల్ ఎస్టేట్ మరియు కాంట్రాక్టుల ద్వారా వేల కోట్లు వెనకేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
