తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం/పాలేరు: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) చేసిన ఆరోపణలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చిచ్చు రేపాయి. నిన్న పాలేరు సభ వేదికగా మంత్రి పొంగులేటి టార్గెట్‌గా కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్యకర్త స్థాయి నుండి మండల అధ్యక్షుల వరకు అంతా ఏకతాటిపైకి వచ్చి కేటీఆర్ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ పొంగులేటి అనుకూల వర్గాలు కేటీఆర్ ఆరోపణలను చీల్చి చెండాడుతున్నాయి…..
‘మతిభ్రమించే చిల్లర మాటలు’ – కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు….
“ఖబర్ధార్ కేటీఆర్… అవాకులు చవాకులు మానేసి నిజాలు మాట్లాడు” అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.పదేళ్ళ పాటు అధికారంలో ఉండి అహంకారంతో ఊగిపోయిన బీఆర్‌ఎస్ నాయకులకు, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో, జిల్లాలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ ఇలాంటి చిల్లర విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.”మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే పరిస్థితి మీకు ఎన్నడూ లేదు. కానీ నేడు మంత్రి పొంగులేటి గారు నిరంతరం నియోజకవర్గంలో “ప్రజా దర్బార్” లు నిర్వహిస్తూ, వేలాది మంది ప్రజల సమస్యలను నేరుగా విని తక్షణ పరిష్కారాలు చూపుతున్నారు. ఆ తేడాను ప్రజలు గమనిస్తున్నారు….
మంత్రి పొంగులేటి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మీకు కనిపించడం లేదా?
పాలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తుచేశారు.ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తోందన్నది వాస్తవం కాదా? పాలేరు నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని వేలాది మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని నిరూపించుకున్న మాట నిజం కాదా? ‘పీఎస్ఆర్ (PSR) ట్రస్ట్’ ద్వారా మంత్రి పొంగులేటి సొంత ఖర్చులతో ఎంతో మంది పేదలకు ఉచిత విద్య, కార్పొరేట్ వైద్యం, ఆర్థిక సహాయం అందిస్తూ నిరంతరం ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న విషయం మీ కండ్లకు కనిపించడం లేదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు…కేటీఆర్ పాలేరుకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి వెళ్లారని,పాలేరు నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుండి ప్రతి పల్లెలోనూ జరుగుతున్న అభివృద్ధి పనులే కేటీఆర్ విమర్శలకు సమాధానమని ఇకనైనా పొంగులేటిపై తప్పుడు కూతలు కూయడం మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
