తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మంసిటీ : రాజకీయాల్లో తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారే ద్రోహులకు కాలం చెల్లుతుందని, ఒంటరిగా పోరాడి గెలిచే సత్తా ఒక్క బీఆర్ఎస్ (గులాబీ) జెండాకే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు….
ఢీకొట్టే సత్తా మాకుంది.. ఆ ‘మహానటుల’కు బుద్ధి చెప్తాం….
సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి కార్పొరేటర్లను గెలిపిస్తే.. వారు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారని మండిపడ్డారు.”పార్టీలో ఉంటూనే లోలోపల కోవర్టు రాజకీయం చేస్తూ పార్టీని బలహీనపరిచిన కొందరు ‘మహానటులు’, ‘మహానటీమణులు’ ఇప్పుడు ముసుగులు తీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారు వెళ్లడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. గతంలో ఖమ్మం జిల్లాలో ఎవరూ లేని సమయంలోనే అధినేత కేసీఆర్ గులాబీ జెండాతో ‘జై తెలంగాణ’ అంటూ ఉద్యమించి పార్టీని నిలబెట్టారు.” అని పువ్వాడ గుర్తు చేశారు.అదే విధంగా బీఆర్ఎస్ చరిత్రను తిరగేస్తే విజయాలే కనిపిస్తాయని.. 2018లో లక్షకు పైగా (1,02,000) ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఖమ్మం కార్పొరేషన్‌ను వరుసగా రెండుసార్లు కైవసం చేసుకున్న ఘనత తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎవరిమీద ఆధారపడకుండా ఒంటరిగా గెలిచే బలం తమకు ఉందన్నారు….
ఓట్ల తొలగింపుకు కుట్రలు.. ‘ఎస్ఐఆర్/ఎన్ఐఆర్’ పై అలర్ట్…..
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సర్వే, మ్యాపింగ్ ప్రక్రియలపై పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలకు, ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAs) కీలక ఆదేశాలు జారీ చేశారు.కొన్ని ప్రాంతాల్లో అధికారికంగా ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ప్రారంభం కాకముందే మ్యాపింగ్ నిర్వహిస్తూ ఓట్లను తొలగించేందుకు బీజేపీ నాయకత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారం చేతిలో ఉందని కాంగ్రెస్ నాయకులు బరితెగించి, ఏకంగా తమ ఇళ్లలోనే కంప్యూటర్లు పెట్టుకుని అక్రమంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రతి ఓటును నిశితంగా గమనించాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు…..
ప్రతి డివిజన్‌లో ‘100 మంది సైన్యం’.. కొత్త వారికి ఆహ్వానం….
పార్టీ పునర్నిర్మాణంపై పువ్వాడ అజయ్ కుమార్ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కార్యకర్తలకు న్యాయం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తామని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల తరహా వాతావరణంలోనూ 11 స్థానాల్లో సర్పంచ్‌లను గెలిపించుకున్నామని చెప్పారు.ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేసే కొత్త నేతలను, యువతను ప్రోత్సహిస్తూ సరికొత్తగా కమిటీలను నిర్మిస్తామని,ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్‌లో 100 మంది చొప్పున బలమైన, నిబద్ధత గల కార్యకర్తల సైన్యాన్ని తయారు చేస్తామని.ఈ వంద మంది ఉంటే ప్రత్యర్థులు మనల్ని ఏమీ చేయలేరని వ్యాఖ్యణించారు,అదే విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చే ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తామని ee సందర్బంగా తెలియజేసారు…ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
