ప్రతి ఓటును కాపాడే బాధ్యత బూత్ కమిటీలదే:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • ప్రతి ఓటును కాపాడే బాధ్యత బూత్ కమిటీలదే....!
  • ఎస్‌ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ శ్రేణులకు అవగాహన కార్యక్రమం....
  • బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్....
  • సమస్యల పరిష్కారానికి ప్రతి 15 రోజులకోసారి సమీక్ష

ఖమ్మం, జూన్ 16:ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూస్తూ, అర్హత కలిగిన ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యులపైనే ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ), డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై బూత్ కమిటీ సభ్యులకు ఆదివారం విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌లతో పాటు ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు…..

ఈ సమావేశంలో ప్రధానంగా రఘునాథపాలెం మండలం, ఖానాపురం హవేలీ మండలం, ఖమ్మం టూ టౌన్ ప్రాంతాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విధివిధానాలు, డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వ నమోదును ఎలా సులభతరంగా చేపట్టాలనే అంశాలపై నాయకులు వారికి సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంచుకుని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.అంతే కాకుండా ఓటర్లకు అవసరమైన ధ్రువపత్రాలు లేనట్లయితే, వారికి అండగా నిలిచి ఆ పత్రాలను సమకూర్చడంలో బూత్ కమిటీలు సహాయపడాలని,
2002 ఓటరు జాబితా ఆధారంగా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన పత్రాలను నిర్ణీత గడువులోపు అధికారులకు సమర్పించేలా చూడాలని ఓటరు జాబితాలో ఏవైనా లోపాలు, తప్పులు ఉన్నట్లయితే వాటిని వెంటనే గుర్తించి సరిచేసే చర్యలు చేపట్టాలని నాయకులు సూచించారు…..

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రజలకు, కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే లోపాలను, సమస్యలను అధిగమించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బూత్ స్థాయి నాయకులకు గానీ, ఓటర్లకు గానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, సమస్యల పరిష్కారానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన అభయమిచ్చారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు జాబితా నుంచి గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment