రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలు రెసిడెన్షియల్ స్కూల్స్ :మల్లు భట్టి విక్రమార్క!!

Pathi Sreenivas Rao
1 Min Read
Highlights
  • లక్ష్మీపురంలో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్' పనుల పరిశీలన....
  • విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి.. భవిష్యత్తుకు పెట్టుబడి....
  • నాణ్యతలో రాజీ పడొద్దు.. గడువులోగా పూర్తి చేయాలి....
  • అధికారులకు, గుత్తేదారులకు స్పష్టమైన ఆదేశాలు

బోనకల్లు (మధిర): మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న జూనియర్, సీనియర్ విద్యార్థుల హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ (పరిపాలనా) బ్లాక్, ల్యాబ్ భవనాల పురోగతిని స్వయంగా పర్యవేక్షించి, అధికారులకు, గుత్తేదారులకు పలు కీలక సూచనలు చేశారు….

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కేవలం ఇటుక, సిమెంట్ తో కడుతున్న భవనాలు కావని, ఇవి రేపటి తరాలను తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలని అభివర్ణించారు. రాష్ట్రంలో కొలువుదీరిన ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. విద్య కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి రూపాయి కేవలం ఖర్చు కాదని, అది భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి అని ఉద్ఘాటించారు….

విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాఠశాల నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులను గట్టిగా ఆదేశించారు. పనుల వేగాన్ని మరింత పెంచి, ముందుగా నిర్ణయించిన గడువులోగా పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment